ఇరాక్ లో భారీ బాంబ్ పేలుళ్లు... పదిమంది మృతి, 20 మందికి గాయాలు

Published : Oct 30, 2022, 09:34 AM IST
ఇరాక్ లో భారీ బాంబ్ పేలుళ్లు... పదిమంది మృతి, 20 మందికి గాయాలు

సారాంశం

ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో శనివారం భారీ పేలుళ్ళ సంభవించారు. ఈ పేలుళ్లలో పదిమంది చనిపోగా మరో 20 మంది తీవ్రగాయాలతో హాస్పిటల్లో చికిత్సపొందుతున్నారు.  

ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో ఉగ్రమూకలు మారణహోమం సృష్టించాయి. రాజధాని బాగ్దాద్ లోని ఫుట్ బాల్ స్టేడియం సమీపంలోని రద్దీ ప్రాంతంలో బాంబుదాడులకు తెగబడ్డారు. ఈ బాంబ్ పేలుళ్లలో పదిమంది మృతిచెందగా మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో చాలామంది పరిస్థితి విషమంగా వుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. 

ఓ వాహనంలో బాంబ్ అమర్చి తూర్పు బాగ్దాద్ లోని రద్దీ ప్రాంతంలో పేలుళ్లకు పాల్పడ్డారు. ఇదే సమయంలో ఓ గ్యాస్ ట్యాంకర్ అక్కడ వుండటంతో అదికూడా పేలడంతో ప్రమాదతీవ్రత మరింత పెరిగిందని ఇరాక్ ఆర్మీ తెలిపింది. మృతులు, గాయపడిన వారిలో చాలామంది చిన్నారులు వున్నట్లు తెలుస్తోంది. ఈ పేలుళ్లకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

అమెరికాలో ఓట్ల‌ను ఎలా లెక్కిస్తారో తెలుసా.? బ్యాలెట్ పేప‌ర్ అయినా అంత వేగం ఎలా.?
అమెరికా ఎన్నిక‌ల్లో స‌త్తా చాటిన హైద‌రాబాద్ మూలాలున్న 27 ఏళ్ల యువ‌తి.. ఎవ‌రీ న‌బీలా స‌య్య‌ద్‌?