USA-China: అమెరికాకు గట్టి దెబ్బ కొట్టిన చైనా.. ఐటీ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం.

అమెరికా, చైనా మధ్య సుంకాల ఉద్రిక్తత కొనసాగుతోంది. అమెరికా  ఒక అడుగు ముందుకు వేస్తే చైనా రెండు అడుగులు వేస్తా అన్నట్లు పరిస్థితులు మారాయి. తాజాగా చైనా అమెరికాకు షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే సెమీకండక్టర్ల తయారీలో ఉపయోగించే అరుదైన లోహాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. దీనివల్ల అమెరికా ఐటీ రంగానికి గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.. 

China Restricts Rare Earth Metal Exports Impacting US Tech Industries in telugu VNR

Beijing: అమెరికా, చైనా మధ్య సుంకాల ఉద్రిక్తత నేపథ్యంలో చైనా మరో షాక్ ఇవ్వనుంది. సెమీకండక్టర్, ఐటీ ఉత్పత్తుల్లో వాడే అరుదైన లోహాల ఎగుమతులపై ఆంక్షలు విధించనుంది. దీనివల్ల అమెరికా ఐటీ రంగానికి దెబ్బ తగిలే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

డిస్ప్రోసియం, నియోడైమియం అనే అరుదైన లోహాలు చైనాలో లభిస్తాయి. ఇవి రక్షణ పరికరాలు, సెమీకండక్టర్లు, ఇంధన రంగం, ఎలక్ట్రానిక్ డిస్‌ప్లేలతో సహా దాదాపు అన్ని టెక్నాలజీలలోనూ కీలకం. ప్రపంచంలో వీటి ఉత్పత్తిలో 90% చైనాదే. ఇప్పుడు చైనా ఎగుమతులపై ఆంక్షలు విధించనుండటంతో, ఐటీ రంగంలో ముందున్న అమెరికాకు గట్టి దెబ్బ తగులుతుంది. సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీకి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. ఇది అమెరికాలో ఉన్న భారతీయ ఐటీ నిపుణులతో పాటు ఇండియాలో అమెరికా ప్రాజెక్టులపై పనిచేస్తున్న వారిపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

ట్రంప్ మాట వినని హార్వర్డ్ యూనివర్సిటీకి 18700 కోట్ల కోత!

Latest Videos

Washington: క్యాంపస్‌లో యూదు వ్యతిరేక విధానాన్ని అరికట్టాలని, యూనివర్సిటీ పాలనలో మార్పులు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించినా హార్వర్డ్ విశ్వవిద్యాలయం పట్టించుకోలేదు. దీంతో 18700 కోట్ల నిధులను ఆపేస్తామని, పన్ను మినహాయింపును రద్దు చేస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ప్రభుత్వ చర్యను విద్యా స్వేచ్ఛపై దాడిగా చాలా మంది విద్యావేత్తలు ఖండించారు. అమెరికాలోని అతి పురాతన విశ్వవిద్యాలయం ట్రంప్ ప్రభుత్వ ఆదేశాలను తిరస్కరించిన మొదటి విశ్వవిద్యాలయంగా నిలిచింది. మిగతా విశ్వవిద్యాలయాలు కూడా ఇదే బాట పడితే విద్యా రంగంలో గందరగోళం తప్పదని భావిస్తున్నారు. 

అమెరికా బోయింగ్ విమానాల కొనుగోలును చైనా నిలిపివేసింది!

Beijing: అమెరికా, చైనా మధ్య సుంకాల వివాదం తీవ్రమైన నేపథ్యంలో, చైనా అమెరికా బోయింగ్ కంపెనీ విమానాల కొనుగోలును నిలిపివేసింది. బోయింగ్ విమానాలను కొనొద్దని తన విమానయాన సంస్థలకు చైనా ఆదేశించింది. ఇప్పటికే ఆర్డర్ చేసిన విమానాలను కూడా తీసుకోవడం లేదు. అంతేకాదు, విమానాల తయారీకి వాడే అమెరికా కంపెనీల విమాన పరికరాలు, విడిభాగాల కొనుగోలును కూడా చైనా రద్దు చేసింది. మరి ఈ ట్రేడ్ వార్ ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. 

vuukle one pixel image
click me!