China వక్రబుద్ధి .. సరిహద్దు వెంట సాయుధ robots మోహ‌రింపు

By Rajesh KFirst Published Jan 1, 2022, 6:35 AM IST
Highlights

చైనా మ‌రోసారి త‌న‌ వక్రబుద్ధిని ప్రదర్శించింది. భార‌త్ ను దొంగ దెబ్బ కొట్టాడానికి స‌రిహ‌ద్దుల వెంట  సాయుధ  robots రంగంలోకి దించిన‌ట్టు తెలుస్తోంది. తూర్పు లద్దాఖ్‌ ప్రాంతంలో  Sharp Claw, Mule-200  అనే సాయుధ రోబోల‌ను స‌రిహ‌ద్దులో మోహ‌రించిన‌ట్టు తెలుస్తోంది. 
 

డ్రాగన్‌ దేశం China..  సరిహద్దుల్లో మరో వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. భారత్ ను దొంగ దెబ్బ కొట్టాడానికి కుయుక్తుల‌కు తెర‌లేపింది. ఇరు దేశాల స‌రిహ‌ద్దుల వెంబ‌డి  పీఎల్‌ఏ (చైనా సైన్యం) మెషిన్‌ గన్లను బిగించినట్టు , అలాగే రోబోట్లతో మ‌న‌దేశంపై యుద్దానికి దిగ‌బోతున్న‌ట్టు అంతర్జాతీయ నివేదికలు తెలుపుతున్నాయి. పాంగోంగ్ లేక్ వద్ద సెప్టెంబర్ 2020లో ఇరు దేశాల సైనికులు మధ్య పెద్ద ఎత్తున  ఘర్షణలు త‌ల్లెత్తిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ర్ష‌ణ తరువాత నుంచి చైనా మరింత దూకుడు పెంచింది. ఎలాగైనా భార‌త్ పై ప్ర‌తికార దాడి చేయాల‌ని భావిస్తోంది. ఇందుకోసం వ్యూహ, ప్ర‌తి వ్యూహాల‌ను ర‌చిస్తోంది.  

ఇటీవ‌ల‌ ..  చైనా  త‌న‌ సైనికులను భారత్ సరిహద్దు ప్రాంత‌మైన‌ “చుసుల్” వద్దకు పంపింది. కానీ ఇక్క‌డ ప్రతికూల వాతావ‌ర‌ణం త‌ట్టుకోలేక డ్రాగ‌న్ సైన్యం వెను తిరిగిన‌ట్టు తెలుస్తోంది.  దీంతో చైనా మరో కుట్ర‌కు ప్లాన్ వేసింది.  భారత సైనికులను ఎదుర్కొనేందుకు  సాయుధ రోబోలను (Armed Robots) భారత సరిహద్దు వద్ద మోహరింప చేసేందుకు సిద్ధమైంది. ఈమేరకు ఇప్పటికే పలురకాల సాయుధ రోబోలను టిబెట్ వరకు పంపినట్లు సమాచారం.

Read Also: ద‌క్షిణభార‌తంపై Omicron పంజా.. Tamil Naduలో ఒక్క రోజే 76 కేసులు

ఈ రోబోల సహాయంతో ఆయుధాలను, ఇతర సామాగ్రిని సరఫరా  చేయ‌డానికి ఉపయోగించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. అంతేకాకుండా.. స‌రిహ‌ద్దులో నిఘా కోసం వీటిని లద్దాఖ్‌ ప్రాంతంలో ఉంచినట్లు తెలుస్తోంది.  ఇదిలాఉంటే.. సాయుధ రోబోలను యుద్ధరంగంలో వినియోగించరాదంటూ అంతర్జాతీయ మానవ హక్కుల వేదిక గతంలో ప్రపంచ దేశాలను కోరింది, ఇంకా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.  

Read Also: R Value: దేశంలో క‌రోనా వైర‌స్ ఆర్‌-ఫ్యాక్టర్ ఆందోళ‌న !

Sharp Claw, Mule-200 అని పిలువబడే రెండు రోబో దళాలను చైనా, భారత్ సరిహద్దు వద్ద మోహరింపజేసినట్లు స‌మాచారం.  ఇందులో Sharp Claw రోబోట్‌కు తేలికపాటి మెషిన్‌గన్స్ ఉంటాయి. దీనిని రిమోట్‌తో ఆపరేట్‌ చేయవచ్చు.  Mule-200 అనే రోబోల ద్వారా ఆయుధాల‌ను స‌రాఫ‌రా చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. దాదాపు 120 నుంచి 250 Mule-200 వాహనాలు టిబెట్ వద్ద సిద్ధంగా ఉన్న‌ట్టు. ఇవి 50 కిలోమీటర్ల దూరంలో ఉండే లక్ష్యాలను సుల‌భంగా  ఛేదించగలద‌ని తెలుస్తోంది. 

Read Also: UK లో ఆస్పత్రిపాలైన వారిలో 90శాతం Booster Dose తీసుకోనివారే..!

టిబెట్‌ ప్రాంతంలో మోహరించిన మొత్తం 88 ‘షార్ప్‌ క్లా’రోబోల్లో 38, మ్యూల్‌ రకానికి చెందిన 120 రోబోల్లో అత్యధికం తూర్పులద్దాఖ్‌ ప్రాంతంలోనే చైనా మోహరిం చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, అన్ని రకాల ప్రాంతాల్లో మోర్టార్లు ..  సైన్యాన్ని తరలించే వీపీ–22 రకానికి చెందిన మొత్తం 70 వాహనాలకు గాను 47 వాహనాలను సరిహద్దుల్లోకి తీసుకువచ్చినట్లు  అంత‌ర్జాతీయ మీడియా స‌మాచారం. ఈక్రమంలో డ్రాగ‌న్ దేశం చైనా ఇలా సాయుధ రోబోలను మోహరించ‌డం కొంత ఆందోళనకరంగా మారింది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని 15 ప్రాంతాల పేర్లను చైనా మార్పుచేయడాన్ని భారత్‌ తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే.  

click me!