UK లో ఆస్పత్రిపాలైన వారిలో 90శాతం Booster Dose తీసుకోనివారే..!

By Rajesh KFirst Published Jan 1, 2022, 3:06 AM IST
Highlights

Omicron In UK : ప్రపంచ దేశాల్లో క‌రోనా వ్యాప్తి వేగం ఉంది. ఈ నేప‌థ్యంలో కోవిడ్-19తో ఆస్పత్రిలో చేరిన వారిలో 90శాతం మంది బూస్టర్‌ డోసులు తీసుకోలేదని సంచ‌ల‌న విష‌యాన్ని వెల్ల‌డించింది. ఒకవైపు కొవిడ్ వ్యాక్సిన్ వేగవంతం చేసినప్పటికీ కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో యూకే ప్రభుత్వం బూస్టర్ డోసులు వేయించుకోవాలని సూచిస్తోంది.  
 

Omicron In UK : ప్రపంచ దేశాల‌ను క‌రోనా వణికిస్తోంది. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా కరోనా కేసుల సంఖ్య తగ్గ‌డం లేదు.యూర‌ప్  దేశాల్లో ఈ వైర‌స్ పంజా విసురుతోంది. ప్ర‌ధానంగా యూకేలో ఈ వేరియంట్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఒక్కో రోజు ల‌క్షలాది కేసులు నమోద‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో కరోనా కట్టడి కోసం బోరిస్ జాన్సన్ ప్రభుత్వం ప‌లు క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకున్నారు. అయినా కేసుల తీవ్రత తగ్గడం లేదు.

 ఒకవైపు కొవిడ్ వ్యాక్సిన్ వేగవంతం చేసినప్పటికీ.. కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో యూకే ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌ప్ప‌ని స‌రిగా బూస్టర్ డోసులు వేయించుకోవాలని సూచిస్తోంది. ఈ క్ర‌మంలో ఓ సంచ‌ల‌న విష‌యాన్ని వెలుగులోకి తెచ్చింది. ఇప్పటివరకూ కరోనాతో ఆస్పత్రిలో పాలైనవారిలో దాదాపు 90% మంది బూస్టర్ డోసు తీసుకోనివారే ఉన్నారని ప్రధాని జాన్సన్ ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. అధికారిక గణాంకాల ప్రకారం, గురువారం నాటికి మొత్తం 11,452 మంది కోవిడ్ -19 తో  ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు.

Read Also: 

ఈ నేప‌థ్యంలో బూస్ట‌ర్ డోస్ వేయించుకోవాల్సిన‌ అవ‌శ్య‌త‌క ఎంతైనా ఉంద‌ని ప్రభుత్వం ప్ర‌క‌టించింది.  ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని కంట్రోల్ చేసే వ్యూహంలో బూస్ట‌ర్ డోస్ భాగమని పేర్కొంది. ఇంగ్లండ్‌లో 28.1 మిలియన్ల కంటే ఎక్కువ మంది బూస్టర్ డోస్‌ను వేసుకున్నార‌ని ఆరోగ్య శాఖ వెల్లడించింది. బూస్టర్ డోసుకు 10 మంది పెద్దవారిలో ఏడుగురు అర్హత కలిగిన ఉన్నారని యూకే అధికారులు తెలిపారు. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని జాన్సన్ నూతన సంవత్సర సందేశంలో పిలుపునిచ్చారు.

Read Also:తెలంగాణలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా: కొత్తగా 311 మందికి పాజిటివ్, ఒక్క హైదరాబాద్‌లోనే 198 కేసులు

జాన్సన్ మీడియాతో మాట్లాడుతూ.. హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షాలు తెలిపారు.  ఇప్ప‌టికే క‌రోనా మ‌హ‌మ్మారి ఎన్నో సవాళ్లను విసురుతోంద‌ని, రాబోయే వారం, నెల రోజుల్లో  ఓమిక్రాన్ బాధితుల సంఖ్య పెరుగుతోందనీ, ఈ క్ర‌మంలో ఆసుపత్రులలో చేరే వారి సంఖ్య కూడా పెరిగి అవ‌కాశ‌ముంద‌ని తెలిపారు.  ఈ క్ర‌మంలో బూస్టర్ డోసుల వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను  మ‌రింత వేగవంతం చేయ‌నున్న‌ట్టు తెలిపారు.  నూతన సంవత్సర వేడుకలలో జాగ్రత్తగా ఉండాలని కోరారు.

Read Also:కరోనా మందు పంపిణీకి అనుమతికై: ఏపీ హైకోర్టులో ఆనందయ్య పిటిషన్

ఆస్పత్రిలో చేరే కరోనా బాధితుల సంఖ్య పెరగడంతో ఆరోగ్య సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో జాన్సన్ ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. యూకేలో గురువారం ఒక్కరోజే  189, 213 క‌రోనా కేసులు నమోదు అయ్యాయి.  అలాగే.. 28 రోజుల వ్యవధిలో మరో 332 మంది కరోనాతో మరణించారు. మార్చి నుంచి రోజువారీ కరోనా టెస్టులు మొత్తంగా రికార్డు స్థాయిలో పెరిగాయని, కరనా మరణాలపై స్పష్టత లేదని NHS ఇంగ్లాండ్ ఒక ప్రకటనలో పేర్కొంది. గత ఏడాది జనవరిలో 34వేల కంటే ఎక్కువ మంది కరోనా బారినపడ్డారు.  

click me!