New Year 2022 : అందరికంటే ముందే 2022లోకి అడుగుపెట్టిన న్యూజిలాండ్

By Siva KodatiFirst Published Dec 31, 2021, 4:47 PM IST
Highlights

న్యూజిలాండ్ (newzealand) వాసులు ప్రపంచంలో అందరికంటే ముందే కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఇక్కడి ఛాధమ్ దీవులు, రాజధాని అక్లాండ్‌లో అర్థరాత్రి 12 గంటలు కావడంతో ప్రజలు సంబరాల్లో మునిగి తేలారు. పెద్ద సంఖ్యలో బాణాసంచా కాల్చి, ఒకొరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

న్యూజిలాండ్ (newzealand) వాసులు ప్రపంచంలో అందరికంటే ముందే కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఇక్కడి ఛాధమ్ దీవులు, రాజధాని అక్లాండ్‌లో అర్థరాత్రి 12 గంటలు కావడంతో ప్రజలు సంబరాల్లో మునిగి తేలారు. పెద్ద సంఖ్యలో బాణాసంచా కాల్చి, ఒకొరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వీరికంటే ముందే పసిఫిక్ మహా సముద్రంలోని (pacific ocean) సమోవా (samoa), టోంటా, కిరిబాటి దీవుల్లో (kiribati) నూతన సంవత్సర వేడుకలు మొదలయ్యాయి. దాదాపు గంట తర్వాత న్యూజిలాండ్ ప్రజలు కొత్త ఏడాదిని ఆహ్వానించారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు న్యూజిలాండ్ కొత్త ఏడాదిలో అడుగుపెట్టింది. 

భారత్ కంటే ఐదున్నర గంటల ముందుగా ఆస్ట్రేలియా (australia) నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటుంది. ముఖ్యంగా సిడ్నీ హార్బర్ బ్రిడ్జి వద్దకు లక్షలాది మంది చేరుకుని న్యూఇయర్ వేడుకల అంబరాన్నంటేలా జరుపుకుంటారు. జపాన్ (japan) సైతం మనకంటే మూడు గంటలు ముందే 2020లోకి అడుగుపెట్టింది. ఇక భారతదేశం కంటే నాలుగున్నర గంటలు ఆలస్యంగా 43 దేశాలు కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతాయి.

click me!