దారుణం.. బ్రేకప్ చెప్పిందని 15 ఏళ్ల మాజీ ప్రేయసిని చంపిన 16 ఏళ్ల బాలుడు.. బర్త్ డేకు ఐదు రోజుల ముందు ఘటన

Published : Jul 03, 2023, 10:21 AM IST
దారుణం.. బ్రేకప్ చెప్పిందని 15 ఏళ్ల మాజీ ప్రేయసిని చంపిన 16 ఏళ్ల బాలుడు.. బర్త్ డేకు ఐదు రోజుల ముందు ఘటన

సారాంశం

అమెరికాలోని కొలరాడోకు చెందిన ఓ 16 ఏళ్ల బాలుడు తన మాజీ ప్రేయసి పట్ల దారుణంగా ప్రవర్తించాడు. తనకు బ్రేకప్ చెప్పిందని కిరాతకంగా హతమార్చాడు. బాలిక పుట్టిన రోజుకు ఐదు రోజుల ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. 

తనకు బ్రేకప్ చెప్పిందని ఓ 16 ఏళ్ల బాలుడు 15 ఏళ్ల బాలికను దారుణంగా హతమార్చాడు. గన్ తో ఆమెపై కాల్పులు జరిపాడు. దీంతో ఆ బాలిక చనిపోయింది. కాల్పుల శబ్దాలు విన్న బాలిక తమ్ముడిని కూడా నిందితుడు బెదిరించాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు బర్త్ డేకు ముందు ఈ విషాదం చోటు చేసుకుంది. అమెరికాలోని కొలరాడోలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో వస్తానో.. లేదో తెలియదు - కార్యకర్తలతో బండి సంజయ్ కుమార్

‘ఎన్డీటీవీ’ కథనం ప్రకారం..  16 ఏళ్ల వయస్సున్న జోవానీ సిరియో-కార్డోనా 15 ఏళ్ల లిల్లీ సిల్వా-లోపెజ్ ఆరు నెలల నుంచి రిలేషన్ షిప్ లో ఉన్నారు. అయితే జోవానీకి లిల్లీ నాలుగు వారాల కిందట బ్రేకప్ చెప్పింది. దీంతో ఆ బాలుడు బాలికపై కోపం పెంచుకున్నాడు. దీంతో ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అతడు జూన్ 16వ తేదీన డెన్వర్ శివారు ప్రాంతమైన గ్రీలీలోని లిల్లీ ట్రయిలర్ పార్క్ ఇంటికి చేరుకున్నాడు. 

లిల్లీ సిల్వా-లోపెజ్ ఉన్న బెడ్ రూమ్ కిటికీ గుండా లోపలకు ప్రవేశించాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న బ్లాక్ గన్, గ్రీన్ స్కూప్ తో ఆమెను చంపేశాడు. అయితే గన్ తో కాల్చిన సమయంలో శబ్దం బయటకు వచ్చింది. ఆ సమయంలో ఇంట్లోని హాల్ లో టీవీ చూస్తున్న 13 ఏళ్ల తమ్ముడి కోసం బాధితురాలు కేకలు వేసింది. దీంతో ఆ బాలుడు పరిగెత్తుకుంటూ బెడ్ రూమ్ లోకి వచ్చాడు. ఆ సమయంలో సిరియో-కార్డోనా చేతిలో బ్లాక్ గన్, గ్రీన్ స్కూప్ ఉండటాన్ని గమనించాడు. తన అక్క కిందపడిపోయి, ముక్కు నుంచి రక్తం కారుతుందని గుర్తించాడు. 

అయ్యో పాపం.. యాక్సిడెంట్ లో తండ్రి మృతి, అడవిలో రాత్రంతా లేపేందుకు ప్రయత్నిస్తూ, ఒంటరిగా ఏడ్చిన మూడేళ్ల బాలుడు

గదిలోకి వచ్చిన బాలుడిని కూడా నిందితుడు బెదిరించాడు. దీంతో తనను ఏమీ చేయొద్దని బాలుడు ప్రాదేయపడ్డాడు. చివరికి బాలుడు ఎవరికీ ఫోన్ చేయకుండా అతడి ఫోన్ నిందితుడు పట్టుకెళ్లాడు. చివరికి ఈ విషయం పోలీసులు తెలియడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బెడ్ రూమ్ లో పలు బుల్లెట్ గాయాలతో లిల్లీ సిల్వా-లోపెజ్ చనిపోయి ఉండటాన్ని గమనించారు. బాధితురాలు పుట్టిన రోజుకు ఐదు రోజుల ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. 

‘‘యూనిఫాం సివిల్ కోడ్ అమలుకు బీఎస్పీ వ్యతిరేకం కాదు.. కానీ..’’- మాయావతి

కాగా.. ఈ హత్యకు ఐదు రోజుల ముందు సిల్వా-లోపెజ్ ను నిందితుడు ముఖంపై గుద్దాడు. దీంతో ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఆమెను హతమార్చడానికి రెండు రోజుల ముందు కూడా జోవానీ సిరియో-కార్డోనా ఆమెను ఇంటి వరకు వెంబడించాడు. అయితే నిందితుడు బాధితురాలి ఇంటికి వెళ్లడం స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే