
కాన్సాస్ : అమెరికాలో తుపాకీ మోతలు మళ్ళీ కలకలం సృష్టించాయి. కొద్దికాలంగా కాస్త తెరిపినిచ్చిన ఈ ఘటనలు మళ్ళీ ఆదివారం నాడు ఆందోళన కలిగించాయి. అమెరికాలోని బాల్టిమోర్, కాన్సాస్ నగరాల్లో జరిగిన రెండు వేరువేరు ఘటనల్లో.. కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయాల పాలయ్యారు. ఆదివారం ఉదయం బాల్టిమోర్ లో గుర్తుతెలియని వ్యక్తి కాల్పులకు పాల్పడగా ఇద్దరు మరణించారు. మరో 28 మంది గాయపడ్డారు.
గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. దక్షిణ బాల్టిమోర్ లోని బ్రూక్లిన్ హోమ్స్ ప్రాంతంలో బ్రూక్లిన్ డే యానివర్సరీ పార్టీ శనివారం రాత్రి ప్రారంభమైంది. ఈ పార్టీకి 100 మంది హాజరయ్యారు. యానివర్సరీ వేడుకలని సంతోషంగా జరుపుకుంటున్న సందర్భంలో.. అర్ధరాత్రి దాటిన తర్వాత 12:30 సమయంలో ఒకసారిగా తుపాకీ మోతలు వినిపించాయి. ఓ వ్యక్తి వారి మీద 30 రౌండ్ల కాల్పులు జరిపాడు.
ట్విట్టర్ యూజర్లకు షాక్.. చదివే పోస్టులపై పరిమితులు విధించిన ఎలాన్ మస్క్.. ఎవరెవరికీ ఎంతంటే ?
ఈ కాల్పుల్లో గాయపడిన బాధితులంతా పెద్దవాే. ఘటన తర్వాత తీవ్రంగా గాయపడిన 9మందిని అంబులెన్స్ లో ఆసుపత్రులకు తరలించారు. మిగిలిన బాధితులు స్థానిక ఆసుపత్రులకు నడిచి వెళ్లారని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరిని అనుమానితులుగా అరెస్టు చేయలేదన్నారు.
ఇక, శనివారం రాత్రి ఒంటిగంటకు కాన్సాస్ లో జరిగిన మరో ఘటనలో ఉత్తర వాషింగ్టన్ వీధిలోని సిటీ నైట్స్ నైట్ క్లబ్లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఏడుగురు గాయపడ్డారు. దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో మరో ఇద్దరూ తీవ్ర గాయాల పాలయ్యారు. కాల్పుల విషయం తెలియడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు వీరందరినీ ఆసుపత్రికి చేర్పించారు.
గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఇక్కడ జరిగిన కాల్పుల ఘటనా స్థలంలో నాలుగు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఆదివారం ఉదయం.. ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిపారు.