ఒలంపిక్స్ లో శృంగారానికి అడ్డకట్ట వేసేందుకు..!

By telugu news teamFirst Published Jul 19, 2021, 8:27 AM IST
Highlights

కరోనా మహమ్మారి కూడా పొంచి ఉండటంతో.. క్రీడాకారులు ఒకరితో మరొకరు కవలకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు. 

టోక్యో ఒలంపిక్స్ త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ ఒలంపిక్స్ లో క్రీడాకారులు సెక్స్ లో మునిగి తేలకుండా ఉండేందుకు నిర్వాహకులు వినూత్నమైన చర్యలు  చేపట్టారు. సెక్స్ పై ఆసక్తి పెరిగితే... ఆటపై దృష్టిపెట్టలేరనే ఉద్దేశంతో.. వినూత్న చర్యలు చేపట్టడం గమనార్హం.

అంతేకాకుండా.. కరోనా మహమ్మారి కూడా పొంచి ఉండటంతో.. క్రీడాకారులు ఒకరితో మరొకరు కవలకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు. శృంగార కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఉండేందుకు తక్కువ సామర్థ్యం ఉన్న మంచాలను సిద్ధం చేశారు.

క్రీడా గ్రామంలోని అథ్లెట్ల గదుల్లో అట్టలతో తయారు చేసిన మంచాలను వేశారు. ఒలంపిక్స్ ముగిసిన తర్వాత ఈ అట్టల్ని రీసైక్లింగ్ ద్వారా కాగితపు ఉత్పత్తులుగా మారుస్తారు. ఒక్కో మంచం గరిష్టంగా 200కిలోల బరువు ఆపుతుందని.. నిరుడు జనవరిలో నిర్వాహకులు ప్రకటించారు. క్రీడాకారుల మధ్య భౌతిక దూరం ఉండాలన్నా ఉద్దేశంతో ఈ మంచాలను తయారు చేయించారు. కాగా... దీనికి సంబంధించిన ఫోటోలను ఓ క్రీడాకారుడు సోషల్ మీడియాలో షేర్ చేయగా... అది కాస్త వైరల్ గా మారింది.

click me!