అఫ్గానిస్థాన్​లో భారీ భూకంపం.. 155 మంది మృతి..

By Sumanth KanukulaFirst Published Jun 22, 2022, 11:51 AM IST
Highlights

అఫ్గానిస్థాన్​లో భారీ భూకంపం సంభవించింది. దేశంలోని తూర్పు పాక్టికా ప్రావిన్స్‌లో సంభవించిన భూకంపంలో  కనీసం 155 మంది మరణించినట్లు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బఖ్తర్ వార్తా సంస్థ నివేదించింది. 

అఫ్గానిస్థాన్​లో భారీ భూకంపం సంభవించింది. దేశంలోని తూర్పు పాక్టికా ప్రావిన్స్‌లో సంభవించిన భూకంపంలో  కనీసం 155 మంది మరణించినట్లు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బఖ్తర్ వార్తా సంస్థ నివేదించింది. అనేక మంది గాయపడినట్టుగా తెలిపింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.  సహాయక చర్యలు చేపట్టేందుకు సిబ్బంది.. ఆ ప్రాంతానికి హెలికాఫ్టర్‌లలో చేరుకుంటున్నారని తెలిపింది. అయితే ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.1 గా నమోదైందని సమాచారం. 

భూకంపం సంభవించిన ప్రాంతం పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉంది. అర్ధరాత్రి సమయంలో భూకంపం సంభవించింది. ‘‘మానవతా విపత్తును నివారించడానికి భూకంపం బాధితులకు తక్షణ సహాయం అందించాలని మేము సహాయ సంస్థలను కోరుతున్నాము’’ అని భూకంపం సంభవించిన తరువాత ప్రభుత్వ ప్రతినిధి బిలాల్ కరీమీ ట్వీట్ చేశారు.

click me!