శృంగార కోరికలు కలగకుండా చికిత్స చేయాలి... పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

By telugu news teamFirst Published Sep 16, 2020, 9:13 AM IST
Highlights

ఇటీవల పాకిస్తాన్ లో.. కన్న బిడ్డల ముందే ఓ మహిళపై కొందరు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి  తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ఈ విధమైన కామెంట్స్ చేశారు.


మహిళలు, బాలికలపై సామూహిక అత్యాచారాలకు పాల్పడే కామాంధులకు.. అసలు శృంగార కోరికలు కలగకుండా చికిత్స చేయాలంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. నిందితులకు కోరికలు తగ్గించే కెమికల్ క్యాస్టేషన్ చికిత్స చేయాలని ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు.  ఇటీవల పాకిస్తాన్ లో.. కన్న బిడ్డల ముందే ఓ మహిళపై కొందరు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి  తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ఈ విధమైన కామెంట్స్ చేశారు.

‘ఇటువంటి దారుణ నేరాలను పాల్పడిన నిందితులను బహిరంగంగా ఉరితీయాలి. అయితే.. మన వ్యాపార భాగస్వాములైన యూరప్ దేశాలు మరణశిక్షను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దారుణ అత్యాచార నిందితులకు ఇటువంటి శిక్షలు విధించడం వల్ల ఆయా దేశాలతో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి.. నేరస్తులకు కెమికల్ క్యాస్ట్రేషన్ ద్వారా కోరికలు తగ్గిపోయేలా చేయాలి. ఇప్పటికే వివిధ దేశాల్లో ఇది జరుగుతున్నట్టు నేను చదివాను’ అని స్థానిక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు. హత్య నేరాలను ఫస్ట్ డిగ్రీ, సెకెండ్ డిగ్రీ అంటూ ఎలా విభజిస్తామో..లైగింక నేరాలను కూడా వాటి తీవ్రతను బట్టి వర్గీకరించాలని ఇమ్రాన్ అభిప్రాయపడ్డారు. 

click me!