Libya: సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చిన 27 మృతదేహాలు..

By Mahesh Rajamoni  |  First Published Dec 27, 2021, 12:44 AM IST

Libya: సముద్రం ఒడ్డుకు 27 మృతదేహాలు కొట్టుకొచ్చాయి. మృతుల్లో ఓ చిన్నారి, ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఈ ఘ‌ట‌న లిబియాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి రెడ్ క్రెసెంట్ సోషల్ మీడియా వేదికగా ప‌లు వివ‌రాలు వెల్ల‌డించింది. 
 


Libya: లిబియా స‌ముద్ర తీరానికి 27కు పైగా మృత దేహాలు కొట్టుకురావ‌డం క‌ల‌క‌లం రేపుతున్న‌ది. చ‌నిపోయిన వారు ఎవ‌ర‌నేదానిపై ఇంకా పూర్తి వివ‌రాలు తెలియ‌లేదు. మృతుల్లో ఇద్ద‌రు మ‌హిళ‌ల‌తో పాటు చిన్నారులు కూడా ఉన్నారు. మృతులంతా వలసదారులేనని రెడ్‌క్రాస్‌కు సమానమైన ఇస్లామిక్ సంస్థ రెడ్ క్రెసెంట్ వెల్ల‌డించింది. దీనికి సంబంధించి మధ్యధరా సముద్రంలో మృతదేహాలు తేలుతున్నట్లు, ఆ సంస్థ కార్మికులు మృత దేహాల‌ను తీసుకువ‌స్తున్న ప‌లు ఫొటోల‌ను రెడ్ క్రిసెంట్ సంస్థ సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంది.  ఖోమ్స్​ పట్టణంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో శనివారం రాత్రి ఈ మృతదేహాలు కనిపించాయ‌నీ,  మరో ముగ్గురిని సిబ్బంది రక్షించార‌ని తెలిపింది.  మిగతావారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామ‌ని కూడా తెలిపింది. మృతులంతా లిబియాలో ఇటీవల జరిగిన పడవ ప్రమాదంలో మృతి చెందిన వలసదారులేనని తెలుస్తోంది.

Also Read: నకిలీ అధికారుల డ్రగ్ కేసు బెదిరింపులు.. భయంతో యువ నటి ఆత్మహత్య

Latest Videos

undefined

ఇదిలావుండ‌గా,  లిబియా రాజధాని ట్రిపోలీలో వలసదారులకు వ్యతిరేకంగా అధికారులు వారి ఘోరమైన చ‌ర్య‌లు, అణ‌చివేత నేప‌థ్యంలో లిబియా నుంచి వ‌ల‌స వెళ్తున్న వారి సంఖ్య పెరిగింది.  చాలామంది దేశం విడిచి ఐరోపాకు పడవల్లో అక్రమంగా వలస వెళ్తుంటారు. ఈ క్రమంలో పడవ మునక ప్రమాదాల్లో ఇప్ప‌టివ‌ర‌కు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.  ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ వెల్ల‌డించిన వివ‌రాల ప్రకారం.. మధ్యధరా సముద్రంలో జరిగిన వివిధ పడవ ప్రమాదాల్లో ఈ ఏడాది దాదాపు 1,500 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల ప్రారంభంలో జరిగిన రెండు వేర్వేరు పడవ మునక ప్రమాదంలో 160 మంది వలసదారులు మరణించారని తెలిపింది. లిబియా తీరంలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో 102 మంది మృత్యువాతపడ్డారని సమాచారం ఉందని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ప్రతినిధి సఫా ఎంసెహ్లీ మంగళవారం తెలిపారు. ఐఓఎం ప్రకారం గత సంవత్సరం 11,900 మంది వసలదారులను అడ్డుకోగా ఈ సారి 31,500ని అడ్డుకున్నారు. అలాగే 2020లో 980 మంది ప్రణాలు కోల్పోయారు.

Also Read: Taliban: 72 కిలో మీట‌ర్లు మ‌హిళ‌లు వెళ్తే.. తాలిబ‌న్ల మ‌రో హుకుం !

ఇదిలావుండగా, దశాబ్దాల తరబడి లిబియాలో సంక్షోభం కొన‌సాగుతున్న‌ది. 2011లో లిబియా పాలకుడు గడాఫీని అమెరికా హతమార్చడంతో ఆ దేశంలో అంతర్యుద్ధం చెలరేగింది. అప్ప‌టి నుంచి దేశంలో ప‌రిస్థితులు దారుణంగా మారాయి. ఆర్థికంగా దేశం అనేక స‌వాళ్ల‌ను ఎదుర్కొంటున్న‌ది. దేశంలోని చాలా మందికి ఉపాధి కరువైంది. రాజ‌కీయ అంత‌ర్యుద్ధం కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలోనే వేరువేరు దేశాల‌తో ఉన్న సుదీర్ఘ స‌రిహ‌ద్దు గుండా వలసదారులను అక్రమంగా రవాణా చేస్తున్నారు. గత కొద్ది మాసాలుగా కొనసాగుతున్న లిబియా అంతర్గత రాజకీయ, భద్రతా, ఆర్థిక చర్చలు మరింత ముందుకు సాగడంలో స్పష్టమైన ప్రగతిని సాధించామని ఇటీవ‌లే ఐక్య‌రాజ్య స‌మితి నివేదిక పేర్కొంది. 2013 నాటికి ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం లిబియా జనాభాలో 12% (7,40,000 మందికి పైగా) విదేశీ వలసదారులు ఉన్నారని అంచనా

Also Read: Delmicron: ఒక‌వైపు ఒమిక్రాన్‌... మ‌రోవైపు డెల్మిక్రాన్ ! .. అమెరికాలో టెన్షన్ టెన్ష‌న్.. !

click me!