Taliban: 72 కిలో మీట‌ర్లు మ‌హిళ‌లు వెళ్తే.. తాలిబ‌న్ల మ‌రో హుకుం !

By Mahesh Rajamoni  |  First Published Dec 26, 2021, 10:53 PM IST

Taliban: ఆఫ్ఘానిస్థాన్ లో తాలిబ‌న్లు మ‌ళ్లీ ఇదివ‌ర‌క‌టిలా త‌మ రాక్ష‌లపాల‌న దిశ‌గా ముందుకు సాగుతున్నారు. ఇప్ప‌టికే మ‌హిళా హ‌క్కుల‌ను హ‌రిస్తూ.. కొత్త కొత్త నిబంధ‌న‌లు తీసుకువ‌చ్చిన తాలిబ‌న్లు.. ఆదివారం నుంచి మ‌హిళా ప్రయాణాల‌పై ఆంక్ష‌లు తీసుకొచ్చారు. 
 


Taliban: తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తాలిబన్ల క్రూర చర్యలకు భయపడి లక్షలాది మంది ఆఫ్ఘాన్‌లు దేశాన్ని విడిచి వెళ్లారు. ఇదివరకు తాలిబన్లు కొనసాగించన రాక్ష‌స పాల‌న‌ను గుర్తుచేసుకుని..  కొందరు తల్లిదండ్రులు తమ పిల్లను రక్షించుకోవడానికి సరిహద్దు కంచే అవతలవున్న భద్రతా బలగాల చేతుల్లోకి పిల్లల్ని విసిరేసిన ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి. ఇదివ‌ర‌కు తాలిబ‌న్ల పాల‌న‌లో మ‌హిళా హ‌క్కుల‌కు తావేలేదు. మ‌ళ్లీ తాలిబ‌న్లు దేశ పాల‌న‌ను త‌మ చేతుల్లోకి తీసుకున్న త‌ర్వాత‌.. అక్క‌డి మ‌హిళ‌ల‌పై అనేక ఆంక్ష‌లు విధించారు. ఈ క్ర‌మంలోనే  మ‌హిళ‌ల ప్రయాణాల పైనా ఆంక్ష‌లు విధించారు తాలిబ‌న్లు.  సన్నిహిత పురుష బంధువు తోడుగా ఉంటేనే మహిళలు రోడ్డు మార్గంలో సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసేందుకు అనుమతిస్తామని ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ అధికారులు ప్రకటించారు. సదాచారాన్ని ప్రోత్సహించడం, అనాచారాలను నిరోధించడం కోసం ఏర్పాటైన మంత్రిత్వ శాఖ ఈ మేర‌కు నిబంధ‌న‌లు జారీ చేసింది.

Also Read: Delmicron: ఒక‌వైపు ఒమిక్రాన్‌... మ‌రోవైపు డెల్మిక్రాన్ ! .. అమెరికాలో టెన్షన్ టెన్ష‌న్.. !

Latest Videos

undefined

సదాచారాన్ని ప్రోత్సహించడం, అనాచారాలను నిరోధించడం కోసం తాలిబ‌న్లు ఓ ప్ర‌త్యేక మంత్రిత్వ శాఖ‌ను ఏర్పాటు చేశారు. ఈ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సడెక్ అకిఫ్ ముహజిర్ ఆదివారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. మ‌హిళ‌ల‌పై విధించిన ప్ర‌యాణ ఆంక్ష‌ల వివ‌రాలు వెల్ల‌డించారు.  సన్నిహిత కుటుంబ సభ్యుడు తోడుగా లేనట్లయితే, మహిళలను రోడ్డు మార్గంలో 45 మైళ్ళు (72 కిలోమీటర్లు) కన్నా ఎక్కువ దూరం ప్రయాణించడానికి అనుమతి లేద‌ని తెలిపారు. ఈ మేర‌కు  ట్రావెల్ ఏజెన్సీలకు ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆంక్ష‌ల‌ను మ‌హిళ‌లు గానీ, ట్రావెల్ ఏజెన్సీలు గానీ ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వంటూ ఆయ‌న హెచ్చ‌రించారు. అలాగే,  వాహనాలలో సంగీతాన్ని వినిపించరాదని కూడా పేర్కొన్నారు.  ఇదిలావుండ‌గా, ఇటీవ‌లే ఈ మంత్రిత్వ శాఖ మ‌హిళ‌ల‌కు సంబంధించి ప‌లు ఆంక్ష‌లు విధించింది. తాలిబ‌న్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఇటీవ‌లి ఆదేశాల్లో  మహిళలు నటించే నాటకాలు, సోప్ ఒపేరాలను ప్రసారం చేయరాదని టెలివిజన్ చానళ్ళను ఆదేశించారు. టీవీ జర్నలిస్టులు ప్రజెంటేషన్ ఇచ్చేటపుడు హెడ్‌స్కార్ఫ్ ధరించాలని ఆదేశించారు. దుకాణాల‌పై మ‌హిళ ఫొటోలతో  కూడిన ప్ర‌క‌ట‌న‌లు, యాడ్ లు ఉండ‌రాద‌ని పేర్కొంది. 

Also Read: Coronavirus: బ్రిట‌న్ లో క‌రోనా టెర్ర‌ర్‌.. ఒక్క‌రోజే 1,22,186 కొత్త కేసులు.. లండ‌న్‌లో ఏకంగా..

ఇదిలావుండ‌గా, ఈ ఏడాది ఆగ‌స్టు 15న తాలిబ‌న్లు ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్ర‌మంలో తాము ఇదివ‌ర‌కు కొన‌సాగించిన పాల‌నలా కాకుండా.. అంద‌రి హ‌క్కుల‌కు గౌర‌వ‌మిస్తామ‌ని పేర్కొన్నారు. కానీ, తాలిబ‌న్లు ఆఫ్ఘాన్ ను స్వాధీనం చేసుకున్న త‌ర్వాత చెప్పిన మాట‌లు ప్ర‌స్తుతం గాలిమూఠ‌లుగానే మిగిలాయి.  ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసే మహిళల్లో చాలా మందికి తిరిగి ఉద్యోగాలు ఇవ్వలేదు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదివే చాలా మంది బాలికలను చదువుకు దూరం చేశారు. మ‌హిళ‌ల‌పై హ‌క్కుల‌ను హ‌రిస్తూ పాల‌న సాగిస్తున్న తాలిబ‌న్ల పై అంత‌ర్జాతీయంగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ప‌లు దేశాలు ఇప్ప‌టికే ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. సంబంధాలు తెంచుకున్నాయి. ప్ర‌స్తుతం మ‌హిళా ప్ర‌యాణాల‌పై తాలిబ‌న్లు తీసుకున్న నిర్ణ‌యంపై అంత‌ర్జాతీయ మ‌హిళా సంఘాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. 1990లో ఆఫ్ఘాన్‌లో తాలిబ‌న్ పాల‌న కొన‌సాగిన రోజుల‌ను గుర్తుచేస్తూ.. మ‌హిళల‌ను నిర్బంధంలో ఉంచే విధంగా తాలిబ‌న్లు ముందుకు సాగుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. పురుషుల‌కు స‌మానంగా మ‌హిళా హ‌క్కుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని డిమాండ్ చేస్తున్నాయి.

Also Read: Assembly Election 2022: ఉత్త‌రాఖండ్ ఎన్నికలు.. కాంగ్రెస్ లో కలవరం.. పార్టీలో మార్పులు చేయాలంటున్న మాజీ సీఎం!

click me!