
న్యూఢిల్లీ: ఆఫ్రికా(Africa) దేశం బుర్కినా ఫాసో(Burkina Faso)లో దారుణం చోటుచేసుకుంది. ఈ దేశం ఉత్తర భాగంలో 41 మంది పౌరులను సాయుధులు(Militants) పొట్టనబెట్టుకున్నారు. ప్రభుత్వ భద్రతా బలగాలకు సహాయం చేస్తున్నవారిని ఆ మిలిటెంట్లు టార్గెట్ చేసుకున్నారు. గురువారం 41 మందిని చంపేశారు. బుర్కినా ఫాసో ప్రభుత్వం ఈ ఘటనను ధ్రువీకరించింది.
బుర్కినా ఫాసోలో భద్రతా బలగాలు బలహీనంగా ఉన్నాయి. ఆర్మీకి సరిపడా ఆయుధాలు లేవు. ఆహారం సరఫరా కూడా కొన్ని సార్లు నిలిపేసిన దుస్థితో ఆ దేశం ఉన్నది. ఇంతటి ఆర్థిక దుస్థితిలో మిలిటెంట్లు అదును చూసి ప్రభుత్వ ఆర్మీ బలగాలపై దాడులు చేయడం మరో సమస్య. ఆర్మీ బలగాలు బలహీనంగా ఉండటంతో ప్రభుత్వం పౌరుల నుంచి మద్దతు కోరింది. ఆర్మీకి మద్దతుగా ప్రజా మిలీషియాను కొద్ది స్థాయిలో తయారు చేసింది. ఇందులో కొందరు పౌరులు స్వచ్ఛందంగా వచ్చి చేరారు. మిలిటెంట్ల బారి నుంచి ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఈ మిలీషియా పని చేస్తుంది.
Also Read: గ్యాస్ ట్యాంకర్ పేలి.. కనీసం 50 మంది సజీవ దహనం
మిలిటరీ ప్రభుత్వం 30 మంది అమాయకులను పొట్టనబెట్టుకుంది. ఈ విషయాన్ని స్థానిక పత్రిక మిలిటరీ అధికారుల కోణంలో కథనం ప్రచురించింది. అయితే, మానవ హక్కుల సంఘాలు ఈ ఘటనపై మండిపడుతున్నాయి. ఘటనా స్థలంలో కాలిపోయిన శవాలు కనిపించాయని చెప్పాయి. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు కరెన్నీ హ్యూమన్ రైట్స్ గ్రూప్ తెలిపింది. మయన్మార్‌లోని కాయా రాష్ట్రంలో శనివారం ఈ దుర్ఘటన జరిగింది.
దేశంలో అంతర్గత వలసలు వెళ్లిన పౌరులను అధికారిక మిలిటరీ పొట్టనబెట్టుకున్నదని మానవ హక్కుల సంఘం వెల్లడించింది. ఇందులో మహిళలు, చిన్నపిల్లలు, వయోధిుకులూ ఉన్నారని వివరించింది. ప్రూసో పట్టణంలోని మోసో గ్రామంలో వారిని చంపేసిందని పేర్కొంది.కాగా, మయన్మార్ అధికార మీడియా సంస్థ మాత్రం ఇందుకు భిన్నమైన కథనాన్ని వెలువరించింది. మయన్మార్ ప్రభుత్వ వ్యతిరేక ఉగ్రవాదులు కొందరు ఆయుధాలతో గ్రామాల్లో తిరుగుతుండగా వారిని మట్టుబెట్టినట్టు పేర్కొంది. వారంతా ఏడు వాహనాల్లో ప్రయాణిస్తున్నారని, వారిని ఆగమన్నా ఆగకుండా వెళ్లిపోతుండగా యాక్షన్‌లోకి దిగినట్టు తెలిపింది.
ప్రభుత్వ బలగాలతోపాటు వారికి మద్దతుగా నిలిచే ఈ మిలీషియాపైనా టెర్రరిస్టులు దాడులు చేస్తున్నారు. తాజాగా, గురువారం కూడా ఆ మిలిటెంట్లు.. ఈ మిలీషియానే టార్గెట్ చేసుకుంది. మాలి దేశ సరిహద్దుకు సమీపంలో కొందరు వ్యాపారులను కాన్వాయ్‌లో వెళ్తుండగా.. వారికి ఎస్కార్ట్‌గా మిలీషియా సభ్యులు ప్రయాణం చేస్తున్నారు. మిలిటెంట్లు.. ఈ కాన్వాయ్‌పై దాడి చేసింది. ఈ దాడిలో 41 మంది మరణించారు. మిలీషియాలో నాయకత్వ స్థానంలో ఉన్న లడ్జీ యారో కూడా ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. అయితే, మృతదేహాల గుర్తింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నదని పేర్కొంది.
Also Read: రెండో ప్రపంచయుద్ధంలో ఇండియాలో పాతిపెట్టిన బాంబులు.. ఇప్పటికీ ప్రాణాలు తీస్తున్నాయి
బుర్కినా ఫాసోనే కాదు.. మాలి, నైగర్‌లోనూ టెర్రరిస్టులు మతం, జాతుల ఆధారంగా శత్రుత్వాలు రేపుతున్నది. రెచ్చగొట్టడం ద్వారా స్థానికులను తమ ఉగ్రవాద సంస్థల్లోకి రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఇందులో చాలా మంది అట్టడుగు వర్గాల వారే అధికంగా ఉంటున్నారు.
పౌరులపై, ఆర్మీ, మిలీషియాపై దాడులు కొత్తవేమీ కావు. నవంబర్‌లోనూ మిలిటెంట్లు ఇలాంటి దాడికే పాల్పడ్డారు. ఇందులో 57 మంది మరణించారు. 53 మంది ఆర్మీకి మద్దతుగా పనిచేస్తున్న వారే కావడం గమనార్హం.