India-Pakistan Border: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి తర్వాత భారత్ , పాకిస్తాన్ మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాక్ సైన్యం గతంలో జరిగిగన కాల్పుల ఒప్పందం ఉల్లంఘించి బోర్డర్‌లో ఆర్మీపై కాల్పులకు దిగింది. ఎంఓసీ వెంబడి పలు ప్రాంతాల్లో ఇండియన్ ఆర్మీ, పాక్ సైన్యానికి మధ్య కాల్పులు జరుగుతున్నాయి. దీంతో బుల్లెట్ల సౌండ్‌లతో బోర్డర్ ఒక్కసారిగా వాతావరణ వేడెక్కింది.
పహల్గాం ఉగ్రదాడితో నేపథ్యంలో భారత్, పాకిస్థాన్‌ల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పటికే భారత్ పాకిస్తానీయులు దేశం విడిచి వెళ్లాలని ఆంక్షలు పెట్టింది. దీంతోపాటు సింధూ నదీ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది. దీనికి బదులుగా పాక్ కూడా భారత్ నుంచి విమానాలు తమ భూభాగం మీదుగా వెళ్లవదని ఆంక్షలు విధించింది. సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతోపాటు సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.
బోర్డర్‌లో కవ్వింపు చర్యల నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ చీఫ్ ద్వివేది శ్రీనగర్ చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీంతోపాటు పర్యాటకులపై దాడులకు పాల్పడిన తీవ్రవాదుల కోసం పోలీసులు, ఆర్మీ జల్లెడె పడుతోంది. దీనిపై కూడా ఆయన పలు కీలక వివరాలు తెలుసుకున్నారు. ఇక బోర్డర్ పాక్ సైన్యానికి ధీటుగా ఆర్మీ బదులిస్తోంది. ఇప్పటి వరకు ఎవరికీ ఏ గాయం కాలేదని.. పాక్ దాడులను సమర్థంగా ఎదుర్కోంటోంది భారత్ ఆర్మీ. గురువారం అర్దరాత్రి నుంచే కాల్పులు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.
బందిపొరాలో కాల్పులు..
ఉగ్రవాదులు కశ్మీర్‌లోని బందిపొరాలో నక్కి ఉన్నారని గుర్తించిన ఇండియన్ ఆర్మీ.. ఆ ప్రాంతానికి చేరుకుంది. ఈక్రమంలో కుల్నార్ బజిపొరా ప్రాంతంలో ముష్కరులు ఉన్నట్లు నిఘావర్గాలు చెప్పడంతో వెంటనో బలగాలు అక్కడికి చేరుకున్నాయి. సైన్యాన్ని చూసిన తీవ్రవాదులు కాల్పులకు దిగారు. ఇక భద్రతా సిబ్బంది కూడా ఎదురుకాల్పులకు దిగారు. అక్కడ రెండు వర్గాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి.
ఇటీవల వరకు ప్రశాంతంగా ఉన్న జమ్మూకశ్మీర్‌గా మరోసారి బాంబులు, గన్‌ల శబ్దాలతో అట్టుడుకుతోంది. ఇప్పటికే దాదాపు 3వేల మంది పర్యాటకులు జమ్మూని విడిచి స్వస్థలాలకు వెళ్లిపోయారు. పూర్తిగా జనజీవనం స్తంభించింది. ఎప్పుడు ఎక్కడ కాల్పులు జరుగుతాయో అని భయాందోళనలు నెలకొన్నాయి. అటు ముష్కరులు సైతం భద్రతా సిబ్బందిపై ఎదురుదాడికి దిగుతున్నారు. ఆర్మీని పక్కదారి పట్టించేందుకు కుట్రలు చేస్తున్నారు.