India US trade: అమెరికాతో భారత్‌ వ్యాపార సంబంధాలు.. సుంకాలు తగ్గించేందుకు రెడీ.. ట్రంప్‌ వెల్లడి!

India US trade: ఇండియా తమ ఉత్పత్తులపై సుంకాలు తగ్గించనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఆయన.. భారత్‌ పలు వస్తువులపై సుంకాలు తగ్గించనున్నట్లు చెప్పారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. అయితే.. ఎలాంటి వస్తువులపై సుంకాలు తగ్గిస్తున్నారు అన్నది మాత్రం ఇప్పటికీ స్పష్టత రాలేదన్నారు. 

India Ready to Cut Tariffs, Strengthens Trade Ties with U.S., Says Trump in telugu tbr

ఈ నెల 23న ఇండియా అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు జరిగాయని ట్రంప్‌ తెలిపారు. ఇండియాతో ఒప్పందం వల్ల అమెరికా వస్తువులకు కొత్త మార్కెట్లు తెరచుకుంటాయని, రెండు దేశాల్లోని రైతులు, వ్యాపార వేత్తలు, ఉద్యోగులు అపార అవకాశాలు లభిస్తాయని అమెరికా చెబుతోంది. అమెరికా సైతం టారిఫ్, టారిఫేతర అడ్డంకులను తగ్గించుకోవాలని భావిస్తున్నట్లు అక్కడి ట్రేడ్‌ ప్రతినిధి అంటున్నారు. 

ఇక ట్రంప్‌ టారిఫ్‌లు పెంచడంపై ఇతర దేశాలు ప్రతికార చర్యల గురించి ఆలోచిస్తున్న వేళ భారత్  మాత్రం అందుక భిన్నంగా వెలుతోంది. సుంకాలు పెంచడం కంటే అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు బలపరుచుకోవడం మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా పీఎం మోదీ కూడా పర్యటనలో కూడా రెండు దేశాల మధ్య వ్యాపార వాణిజ్య ఒప్పందాలకు అడుగులు పడిన సంగతి తెలిసిందే. ప్రతికార చర్యల కంటే.. సానుకూలధోరణితో రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరుచుకోవడమే తమకు ముఖ్యం అన్నట్లు రెండు దేశాల అధినేతలు ఉన్నట్లు తెలుస్తోంది. 
India Ready to Cut Tariffs, Strengthens Trade Ties with U.S., Says Trump in telugu tbr

ఇటీవల భారత్‌తో మూడు రోజుల పాటు జరిగిన వాణిజ్య చర్చల్లో.. భారత బృందానికి వాణిజ్య విభాగ అదనపు కార్యదర్శి రాజేశ్‌ అగర్వాల్‌ అధ్యక్షత వహించారు. ఈ చర్చలతో టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్సెస్‌ కు రెండు దేశాలు ముందుకొచ్చాయి. దీంతోపాటు 90 రోజుల పాటు టారిఫ్‌ అమలుకు అమెరికా విరామం ప్రకటించింది. దీనిని బట్టి ఇండియా పక్కా వ్యూహంతోనే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

Latest Videos

 

 

 

vuukle one pixel image
click me!