India-Pakistan: ఇండియా ఎప్పుడూ యుద్దం కోరుకోదు.. చాలా సహనంగా వ్యవహరిస్తుంటుంది. పాకిస్థాన్ గతంలో కవ్వింపు చర్యలకు పాల్పడి, పలువురు జవాన్లను చంపినా చూసీచూడనట్లుగా వదిలేసింది. కానీ జమ్మూలో పర్యాటకులను ఉగ్రవాదులు హతమార్చిన తర్వాత పాక్‌పై ప్రతికారానికి సిద్దమైంది. అయితే.. అందరూ ఊహించినట్లు ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్ చేయడం వంటి చర్యలు కాదు..! అంతకుమించిన ప్లాన్ భారత్ వేస్తోంది. ఈ దెబ్బతో పాకిస్తాన్ కాళ్ల బేరానికి రావడం ఖాయంగా కనిపిస్తోంది. అదే సింధూ జలాల పంపిణీ ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం.
పాకిస్తాన్ ప్రజలకు అక్కడి వ్యవసాయానికి 80 శాతం వరకు నీటిని సింధూ నది, ఉప నదుల నుంచే వినియోగించుకుంటారు. అయితే.. ఈ నదులు అన్నీ భారత్ నుంచి వెళ్తుంటాయి. ఈ జలాలను ఒక్కసారి కనుక భారత్ అడ్డుకుంటే.. పాక్ ప్రజలు గొంతెండి చచ్చిపోతారు. ప్రస్తుతం అలాంటి ప్లాన్ భారత్ వేస్తోంది. గతంలో ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా చూస్తూ ఉన్న భారత్.. తాజాగా జమ్మూలో జరిగిన ఘటనను సీరియస్‌గా తీసుకుంది. అందరూ ప్రతికారం తీర్చుకుంటారని అనుకోగా.. మరోరకంగా పాక్‌ను దెబ్బకొట్టేందుకు కేంద్రం సిద్దమైంది. ఉగ్రదాడి జరిగిన వెంటనే ఇండియా-పాక్ మధ్య ఉన్న సింధూ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసేంది.
పాకిస్తాన్‌కు నదీ జలాలే జీవనాడులు. 1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్-పాక్ మధ్య నదీ జలాల ఒప్పందం కుదిరింది.
మొత్తం ఆరు నదులు ఉండగా.. సమానంగా భారత్, పాక్ పంచుకున్నాయి. సింధూ, జీలమ్, చీనాబ్ నదుల నీరు పాక్‌కు కేటాయించగా.. దీంతోపాటు బియాస్, సట్లెజ్ నీరు కూడా అక్కడికే వెళ్తుంది. ఒప్పందం ప్రకారం.. ఇండియా ఈ జలాలను పాక్ అవసరాల మేర వాడుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం కేవలం జలవిద్యుత్ ఉత్పత్తికి మాత్రమే ఇండియా ఆ నీటిని వినియోగిస్తోంది. ఇది పూర్తిగా పాక్‌పై దయతోనే భారత్ ఈ ఒప్పందం కుదుర్చుకుంది.
పాక్‌లో సుమారు 23.7 కోట్ల మంది ప్రజలకు ఈ నదీ జలాల నీరు తాగుతున్నారు. కరాచీ, లాహోర్, ముల్తాన్ నగరాల ప్రజలు పూర్తిగా ఈ నదుల నీటినే తాగుతారు. అక్కడ వ్యవసాయానికి కూడా 80 శాతం ఇదే నీటిని వినియోగిస్తున్నారు. సుమారు 16 లక్షల హెక్టార్లు సాగు చేస్తున్నారు. పాక్ ఆర్మీ కార్యకలాపాలు సాగించే పంజాబ్ ప్రావిన్స్‌కు ఈ నీరే దిక్కు. సింధూ బేసిన్ నుంచి పాక్‌కు ఏటా 154.3 మిలియన్ ఎకరాల అడుగుల నీటిని ఏటా సరఫరా చేస్తున్నారు. దీంతో ఆ దేశ ఆహారభద్రతకు కీలకంగా నీటి ఆవస్యకత ఉంది.
పాక్ ఇప్పటికే తీవ్రమైన సంక్షోభంలో ఉంది. రూపాయి విలువ పతనం అయ్యింది. ఆహారం కూడా దొరకని పరిస్థితి. వ్యవసాయం పూర్తిగా దివాలా తీసింది. భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. ఈ నేపథ్యంలో సింధూ జలాలను భారత్ అడ్డుకుంటే మాత్రం పాక్‌కు చుక్కలు కనిపిస్తాయి. కనీవిని ఎరుగని రీతిలో పాక్‌కు నష్టం వాటిల్లనుంది. తాగు,సాగు నీటితోపాటు.. పాక్‌లో విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన మంగల డ్యామ్‌ను జీలమ్ నదిపై నిర్మించారు. దీని నుంచి ఏటా 8 శాతం తయారీ జరుగుతోంది. సింధూ నదిపై నిర్మించిన తర్బెల డ్యామ్ 16 శాతానికి పైగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తోంది. ఇప్పుడు సింధూ జలాల ఒప్పందంతో పాక్ సుమారు 24శాతం జల విద్యుత్తుపై ప్రభావం పడనుంది.
ఇక పాక్‌కు ఇప్పటి వరకు నీటి నిల్వకు సరైన డ్యామ్‌లు లేవు. మంగలా, తర్బెల డ్యామ్‌లలో కేవలం 14.4 ఎమ్‌ఏఫ్ నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. ఇది పాక్ వినియోగించుకుంటున్న నీటిలో కేవలం 10 శాతం మాత్రమే.. మిగిలిన నీరు అంతా నిత్యం ప్రవహించే సిందూ నదుల నుంచే వినియోగించుకుంటున్నారు.
భారత్ ప్లాన్ ఇదే..
సింధూ నదికి ఎగువ భాగాన భారత్ ఉండటంతో నీటిపై అధిక హక్కులు ఆ దేశానికే ఉంటాయి. ఈక్రమంలో నీటి జాలల పంపిణీ ఒప్పందం ఇండియా ఎప్పుడైనా చేసుకోవచ్చు. దీనిపై ఎవరి అభిప్రాయంతో పనిలేదు. అంతేకాదు.. సింధూ జలాల ఒప్పందం కింద కిషన్ గంగా ఇతర రిజర్వాయర్లు కీలకం. వీటిలోని నీటిని ఇప్పుడు ఖాళీ చేస్తే.. తిరిగి నీరు నింపేందుకు ఆగస్టు వరకు ఎదురుచూడాలి. ఇలా చేసినా నీటి కోసం పాక్ కటకటలాడాల్సిందే.. మరోరకంగా పాక్ వ్యవసాయ రంగంపై కూడా దెబ్బపడుతుంది. అంతేకాకుండా వర్షాకాలంలో భారత్‌లో జీలమ్ నది వల్ల వరదలు వస్తున్నాయని, రెండు మూడు డ్యాములు కట్టుకోవచ్చు. ఇలా చేసినా పాక్‌కు నీటి సరఫరా తగ్గిపోతుంది.
అయితే.. ఇండియా తీసుకుంటున్న నిర్ణయం వల్ల పాక్‌కి ఇప్పుడే నొప్పి తెలియకపోవచ్చని నిపుణులు అంటున్నారు. నెమ్మదిగా భారత్ సింధూ జలాలపై డ్యామ్‌లను ఏర్పాటు చేసుకుంటే.. భవిష్యత్తులో పాక్‌ను ఇబ్బందులకు గురిచేయవచ్చు. ప్రస్తుతం భారత్‌కు నీటిని ఆపే సామర్థ్యం లేదు... కానీ ఇప్పుడు ఒప్పందాలు రద్దు చేసుకోవడంతో ఇండియా యథేచ్చగా డ్యామ్‌లను నిర్మించుకోవచ్చు.. అదే జరిగితే పాక్ గొంతెండటం మాత్రం ఖాయమని నిపుణులు అంటున్నారు.