Kashmir Terrorist Attack: వారిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉందామని నిశ్చయించుకున్నారు.. కలకాలం కలిసుండాలని కలలు కన్నారు. కానీ ఇద్దరూ కలిసి ఏడడుగులు వేసి.. ఏడు రోజులు కాకుండానే విధి దూరం చేసింది. జమ్మూకశ్మీర్‌లో మంగళవారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో నేవీ ఉద్యోగి 26 ఏళ్ల వినయ్ నర్వాల్ చనిపోయాడు. ఇటీవలే ఇతనికి పెళ్లి కాగా.. భార్యతో కలిసి హనీమూన్ చేసుకోవడానికి కశ్మీర్ వచ్చారు. ఆక్రమంలో ఉగ్రమూకల దాడికి బలైపోయాడు.
వారిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉందామని నిశ్చయించుకున్నారు.. కలకాలం కలిసుండాలని కలలు కన్నారు. కానీ ఇద్దరూ కలిసి ఏడడుగులు వేసి.. ఏడు రోజులు కాకుండానే విధి దూరం చేసింది. జమ్మూకశ్మీర్‌లో మంగళవారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో నేవీ ఉద్యోగి 26 ఏళ్ల వినయ్ నర్వాల్ చనిపోయాడు. ఇటీవలే ఇతనికి పెళ్లి కాగా.. భార్యతో కలిసి హనీమూన్ చేసుకోవడానికి కశ్మీర్ వచ్చారు. ఆక్రమంలో ఉగ్రమూకల దాడికి బలైపోయాడు.
వినయ్ నర్వాల్ రెండేళ్ల కిందటే నేవీ ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చింది. సరిగ్గా వారం కిందటే పెళ్లి కూడా చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో భార్యతో కలిసి పహల్గామ్ వద్ద టారిస్ట్‌ప్లేస్‌ను పరిశీలిస్తున్న క్రమంలో ఉగ్రవాదులు ఒక్కసారి దాడికి దిగారు. వినయ్ నర్వాల్ వద్దకు వచ్చిన ముష్కరులు నువ్వు ముస్లిమా కాదా అని అడిగారు. తను మాట్లాడే లోపే వెంటనే ఐడీ చూపించాలని అడిగారు. ఆర్మీ దుస్తులలో ఉన్న తీవ్రవాదులను గుర్తించలేని వినయ్.. వెంటనే తన ఐడీ కార్డును చూపించగా... పేరు వివరాలు చదివి వెంటనే అతనిపై నిర్దాక్షణంగా కాల్పులు జరిపారు.
వినయ్ పక్కనే ఉన్న భార్యను వదిలేసిన ముష్కరులు.. విగతజీవిగా పడిఉన్న వినయ్‌ని చూసి బోరున విలపించింది. మృతదేహం పక్కనే కూర్చుని ఆమె ఏడుండగా.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటో చూసిన ప్రతి ఒక్కరూ అయ్యో ఎంత ఘోరం చేశారు.. అని మాట్లాడుకుంటున్నారు.
వివాహం జరిగిన కొద్ది రోజులకే ముష్కరుల దాడిలో మరణించడం అందరినీ కదిలించింది. రెండేళ్ల క్రితం నేవీలో చేరిన వినయ్ నర్వాల్ కొచ్చి లో లెఫ్టినెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఏప్రిల్ 16న ఇతనికి వివాహం జరగగా.. ఈ నెల 19న వివాహ రిసెప్షన్ పూర్తయ్యింది. ఈక్రమంలో చిన్న ట్రిప్ కోసం పహల్గామ్ వెళ్లాడు. అంతలోనే మృత్యువు ఒడిలోకి చేరాడు.