Kashmir Encounter: జమ్మూకశ్మీర్‌లో ముష్కరుల ఏరివేత కొనసాగుతోంది. తీవ్రవాదుల జాడ కోసం.. ప్రతి ఇంటినీ జల్లెడ పడుతూ.. ఆర్మీ ముందుకు సాగుతోంది. ఈక్రమంలో లష్కరే టాప్ కమాండన్ భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఇండియన్ ఆర్మీ- పోలీసులు ముప్పేట బుల్లెట్ల వర్షం కురిపించాయి. ఈ దెబ్బతో పహల్గాం దాడిలో కీలకపాత్రదారి హతమయ్యాడు.
దొరికిన వారిని తురుముదాం.. దొరకని వారిని తరుముదాం అన్నట్లు ఇండియన్ ఆర్మీ సిద్దమైంది. తీవ్రవాదులు బందీపొరా అనే ప్రాంతంలో నక్కి ఉన్నారన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో... భారీగా అక్కడికి సైన్యం చేరుకుంది. ముందుగా ఆ ప్రాంతాన్ని తమ ఆదీనంలోకి తెచ్చుకున్న ఆర్మీ- పోలీసులు.. ఒక్కొక్క ఇంటిని జల్లెడ పడుతూ.. అనుమానం వస్తే చాలు ఆ ఇంటిపై తుపాకులతో గర్జిస్తున్నారు. ఉగ్రవాదులను గుర్తించి ఎన్‌కౌంటర్ చేస్తున్నారు. మరోవైపు ముష్కరులకు ఆర్మీకి మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈక్రమంలో భద్రతా దళాల్లోని అధికారి బాడీగార్డులకు తూటాలు తాకాయి. మరో తీవ్రవాదికి గాయాలయ్యాయి.
గురిపెట్టి కాల్చి.. ఏరివేసిన సైన్యం..
పహల్గాం దాడిలో కీలకంగా ఉన్న లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్‌ను గురిపెట్టి కాల్చి చంపారు. అనంతరం ఈవిషయాన్ని బయటకు వెళ్లడించారు. ఇండియన్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కశ్మీర్‌లో అడుగుపెట్టిన గంటల వ్యవధిలోనే ముష్కరులపై ఎన్‌కౌంటర్ చేయడం ప్రారంభమైంది. ఇక పహల్గాంలో దాడి వెనక లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ పాత్ర ఉన్నట్లు భద్రతా బృందాలు గుర్తించాయి. కశ్మీర్‌లో యాక్టివ్‌గా పనిచేస్తున్న వింగ్‌కి అతడే నాయకత్వం వహిస్తున్నాడు. ఇందులో అత్యధికులు విదేశీ ఉగ్రవాదులు, స్థానికులు కొందరే ఉండేలా వింగ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. స్తానికులు వీరికి అన్ని విధాలుగా సహకరిస్తున్నట్లు ఆర్మీ గుర్తించింది.
పాక్ ఇంటెలిజెన్స్, మిలిటరీ సహకారంతోనే..
హఫీజ్ సయీద్, అతనికి అసిస్టెంట్ సైఫుల్లా వారి బృందానికి టార్గెట్‌లు సెట్ చేసేది, సలహాలు, సూచనలు అన్నీ పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, పార్ ఆర్మీ నుంచే వస్తున్నాయని గుర్తించారు. పహల్గాంలో మొత్తం మూడు ప్రాంతాల్లో ముష్కరులు దాడులుచేశారు. ఇది కూడా పాక్ ఇంటెలిజెన్స్ ప్లాన్ అని ఇండియన్ అధికారులు చెబుతున్నారు. మూడు ప్రదేశాల్లో అత్యధికగా ఉన్న పర్యాటకులను ఎంపిక చేసుకుని దాడికి దిగారు. మొదట ఐదుగురిని కాల్చగా.. ఇంకో ప్రాంతంలో మరో ఇద్దరి, ఇది పారిపోతున్న వారిపై విచక్షణా రహితంగా ఉగ్రవాడులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో పాల్గొన్న హషీమ్ ముసా, అలిభాయ్ అనే తీవ్రవాదులు పాకిస్తానీయులుగా గుర్తించారు. ఇక పర్యాటకులపై దాడికి పాల్పడిన వారిని గుర్తిస్తే ఒక్కొక్కరిపై రూ.20 లక్షల రివార్డును భారత ప్రభుత్వం ప్రకటించింది.
రెండేళ్లుగా దాడులు చేస్తున్న తీవ్రవాదులు..
హఫీజ్ సయీద్, సైఫుల్లా కలిసి గత రెండేళ్లుగా జమ్మూలో తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. సోనమార్గ్, బూటపత్రి, గందర్బాల్ ప్రాంతాల్లో హైప్రొఫైల్ దాడుల్లో కూడా వీరు పాల్గొన్నారు. గతేడాది అక్టోబర్‌లో బూటపత్రిలో ఇద్దరు జవాన్లపై దాడి చేసి చంపారు. అదే నెలలో సోనమార్గ్ సొరంగంలో పనిచేస్తున్న ఆరుగురు కార్మికులను కాల్చి చంపారు. ఈ టీంలో ముఖ్య సభ్యుడైన జునైద్ అహ్మద్ భట్ డిసెంబర్‌లో భద్రతా దళాలు ఎన్‌కౌంటర్ చేశాయి. ఆ తర్వాత మిగిలిన ఉగ్రవాదులు ఎవరికీ కనిపించకుండా చాలాకాలం అఘ్నాతంలోకి వెళ్లిపోయారు. ఇక ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ సైన్యం ఒక్కొక్క తీవ్రవాదిని ఏరివేస్తోంది. కలుగుల్లో దాగి ఉన్నా బయటకు లాగి కాల్చి పడేస్తోంది.