ఈఎస్ఐ మందుల కొనుగోలు కేసులో నిందితులను ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపర్చారు.
హైదరాబాద్: ఈఎస్ఐ మందుల కొనుగోలు స్కాంలో డైరెక్టర్ దేవికారాణితో పాటు మరో ఏడుగురికి నిందిులకు 14 రోజులపాటు రిమాండ్ విధించారు.ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలను నిర్వహించిన తర్వాత నిందితులను శుక్రవారం నాడు ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు.
ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణితో పాటు ఏడుగురు నిందితులను హాజరుపరిస్తే 14 రోజుల పాటు రిమాండ్ విధించారు.ఈ ఏడాది అక్టోబర్ 11 వరకు వీరంతా రిమాండ్ లో ఉంటారు. 2012 లో జారీ అయిన 51 జీవోకు విరుద్దంగా మందులను కొనుగోలు చేసినట్టుగా గుర్తించారు.
undefined
ఇప్పటివరకు అధికారులు పరిశీలించిన జాబితాలో సుమారు రూ. 10 కోట్లకు పైగా అవకతవకలు జరిగినట్టుగా గుర్తించారు. ఇంకా మందుల కొనుగోలులో అవకతవకలపై విచారణ సాగుతోందని ఏసీబీ అధికారులు ప్రకటించారు.
సంబంధిత వార్తలు:
వైద్య పరీక్షల కోసం దేవికా రాణితో పాటు ఏడుగురు ఉస్మానియాకు తరలింపు
ఈఎస్ఐ డైరెక్టర్ దేవికా రాణి అరెస్ట్ (వీడియో)
ఈఎస్ఐ మందుల స్కాం... దేవికా రాణి అరెస్ట్
అవసరం లేకపోయినా మందుల కొనుగోళ్లు: టీఎస్ ఈఎస్ఐలో రూ.300 కోట్ల స్కాం