కోహ్లీ జెర్సీని వేలం వేసిన పాక్ క్రికెటర్

Published : Aug 02, 2017, 03:11 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
కోహ్లీ జెర్సీని వేలం వేసిన పాక్ క్రికెటర్

సారాంశం

ఫౌండేషన్ నిర్వహిస్తున్న అఫ్రిది జెర్సీని అంద జేసిన కోహ్లీ

ఇండియా.. పాకిస్థాన్.. ఈ రెండు దేశాలకు పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంత శత్రుత్వం ఉంది. కానీ ఓ మంచి పని కోసం ఈ రెండు దేశాలు ఒక్కటయ్యాయి. వివరాల్లోకి వెళితే.. .. పాకిస్తాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది SA ఫౌండేషన్ పేరుతో అఫ్రిది ఓ స్వచ్చంద సంస్థను నిర్వహిస్తున్నాడు. ఈ సంస్థ కోసం  టీమిండియా కెప్టెన్ విరాట్‌కోహ్లీ జెర్సీని అఫ్రిది వేలం వేశారు.  

గత  ఆదివారం లండన్‌లో అఫ్రిది ఓ ప్రత్యేక విందు కార్యక్రమం ఏర్పాటు చేసి తన దగ్గర ఉన్న క్రికెట్‌ వస్తువులను వేలం నిర్వహించాడు. ఇందులో కోహ్లీ జెర్సీ రూ 4300 యూరోలకు (రూ 3,25,740) అమ్ముడుపోయింది. దీంతో పాటు తన దగ్గర ఉన్న పలువురి ఆటగాళ్ల జెర్సీలను కూడా వేలం నిర్వహించాడు. ఇందులో వచ్చిన నగదును తన పౌండేషన్‌కు ఇచ్చి దాని ద్వారా చిన్నారుల విద్యకోసం ఉపయోగించనున్నాడు.

 

2016 లో భారత్‌లో నిర్వహించిన టీ 20 ప్రపంచకప్‌ టోర్నమెంట్‌ సమయంలో కోహ్లీ తన జెర్సీని అఫ్రిదికి అందించాడు. ‘ షాహిద్ బాయ్.. నీకు బెస్ట్  విషెస్.. నీతో ఆడటానికి మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం’ అని కొహ్లీ ఆ జెర్సీ పై రాసి మరీ అఫ్రిదికి అందజేశారు. దీనిపై భారత ఆటగాళ్లు అంతా సంతకాలు చేశారు.

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)