
4జీ సిమ్ తో భారత్ టెలికాం మార్కెట్ లోకి ప్రవేశించిన జియో, ఇక ఆఫర్ల కాలం జియో ముగిసిందనే చెప్పుకోవాలి.
ఎస్ అండ్ పీ సంస్ధ నివేధిక ప్రకారం జియో అందిస్తున్న ఆఫర్లకు స్వస్థి పలకుందట, జియో తను అనుకున్న టార్గెట్ కన్న అధిక కస్టమర్లను తనలో చెర్చుకుంది. ఇక జియోకి ఆఫర్లు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపింది.
జియోలో దాదాపుగా ఇప్పటి వరకు దేశంలో ఉన్న 12శాతం టెలికాం కస్టమర్లు చెరినట్లు గా ఎస్ అండ్ పీ సంస్థ తెలిపింది. దేశంలో తక్కువ సమయంలో అత్యధిక కస్టమర్లను సంపాధించుకున్న సంస్థగా పేరుగడించింది. అయితే జియో తన బ్రాండ్ వాల్యూను పెంచడానికి, ప్రజల మధ్యకి తన సేవలు త్వరగా చేరుకొవడానికి ఇన్నాళ్లు ఇచ్చిన ఆఫర్లు పనిచేశాయి. ఇక మీదట కూడా ఇలాంటి ఆఫర్లును అందిస్తే ఆ సంస్థకు కష్టాలు తప్పవని ఎస్ అండ్ పీ సంస్థ పెర్కోన్నది.
2016 నవంబరులో మార్కెట్లోకి వచ్చిన రిలయన్స్ జియో, వాయిస్ కాల్స్ ను జీవితాంతం ఉచితంగా అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. పైగా ఇతర కంపెనీలతో పోలిస్తే, ఇక ఉచిత ఆఫర్లు కు పక్క ముగింపు పలనుందని తెలస్తుంది.