
నేడు సమాజం లో ఆడ, మగ తేడా లేకుండా ప్రయాణిస్తుంది. ఇరువురికి సమాన అధికారాలు కల్పిస్తుంది. కానీ కేవలం బయటికి మాత్రమే సమానం అంటున్నారు, ఇప్పటికి ఆడవారిపైన చిన్న చూపు కొనసాగుతునే ఉంది. ఆడవారిపై చిన్న చూపు ఏ ఒక్క దేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితి ఇలాగే ఉంది. తాజా వెలుగులోకి వచ్చిన ఒక నివేధికతో మరింత బలంగా ఉందని తెలుస్తుంది.
అస్ట్రేలియా యూనివర్శీల పై మానవ హాక్కుల సంఘం ఒక నివేధికను అక్కడి ప్రభుత్వానికి అందించింది. అందులో ప్రధానంగా అమ్మాయిలపై లైంగిక దాడుల గురించి ప్రస్తవించింది. యూనివర్శీటీల్లో చదువుతున్న అమ్మాయిలపై అధికంగా లైంగిక దాడులు జరుగతున్నట్లు తెలిపింది. ఆ దేశంలో ఉన్న అన్ని యూనివర్శీటీల అమ్మాయిలను విచారించిన మానవ హాక్కుల సంఘం ఈ వివరాలను వెల్లడించింది
ఆస్ట్రేలియా దేశంలో 40,000 మంది అమ్మాయిలను విచారించారు. అందులో 30,000 మంది అమ్మాయిలపై తమ కళాశాలలో, లేదా బయటి ఎదో రకంగా లైంగిక వేదింపులు జరుగుతున్నాయని తెలిపింది. ముఖ్యంగా క్యాంపస్‌లో ఈ దాడులు మరీ ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. 2016 లో అస్ట్రేలియా లో అక్కడ అమ్మాయిలపైన మరీ అధికంగా దాడులు జరిగినట్లు తెలిపింది.
దీనిపైన ది గార్డియన్ సంస్థ ఒక ఆర్టీకల్ ను ప్రచురించింది. ఆగష్టు ఒకటవ తేదీన ఒక లైవ్ డిబెట్ నిర్వహించారు అందులో వేలాది మంది ఆస్ట్రేలియన్ అమ్మాయిలు పాల్గోన్నారు. వారు.. లైంగిక దాడుల పైన సరైన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.