మాటే వెంకయ్య ఆయుధం: కెసిఆర్

Published : Aug 21, 2017, 12:39 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
మాటే వెంకయ్య ఆయుధం: కెసిఆర్

సారాంశం

మ‌న తెలుగు బిడ్డ వెంక‌య్య నాయుడు లాంటి వ‌క్త‌ను త‌న జీవితంలో చూడ‌లేదు. అద్బుతంగా మాట్లాడే  అరుదైనా వ్య‌క్తిగా అని కొనియాడారు తెలుగు జాతికి ల‌భించిన ఆణి ముత్యం. ఆనాడు స‌భ‌లో ఎమ‌ర్జెన్సీకి వ్య‌తిరేకంగా ఆయ‌న‌ వ్యంగ్యంగా ప్ర‌సంగించారు వాజ్‌పేయ్ హాయాంలో బీజేపి అధ్య‌క్షుడిగా మ‌న తెలుగు జాతి గౌవ‌రావాన్ని పెంచారు.

దేశ వ్యాప్తంగా ఎంద‌రినో గొప్ప వ్య‌క్తుల‌ను చూశాను, కానీ మ‌న తెలుగు బిడ్డ వెంక‌య్య నాయుడు లాంటి వ‌క్త‌ను త‌న జీవితంలో చూడ‌లేద‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు తెలిపారు. ఆయ‌న‌ తెలుగు జాతికి ల‌భించిన ఆణిముత్యంగా తాను భావిస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు. ఉప రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వితో తెలుగు కీర్తీని ఆయన మ‌రింత ముందుకు తీసుకెళ్లతాడని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

వెంక‌య్య అద్బుతమైన వ్‌‌క్త  అని అలాంటి ల‌క్ష‌ణాలు అందరికి అంత త్వ‌ర‌గా అబ్బ‌వ‌ని ముఖ్యమంత్రి తెలిపారు. ఆయ‌న ఎందులో అయినా ఆన‌ర్గ‌ళంగా మాట్లాడం వెనుక ఎంతో కృషి ఉందని, వ‌క్తగా  ఉపన్యాసాన్ని పండించ‌డం అంత‌ ఈజీ కాదని, అద్బుత‌మైనా ప‌దాల కూర్పుతో  మాట్లాడ‌టం ఒక‌ వెంక‌య్య నాయుడికే చెల్లును అని సీఎం పేర్కొన్నారు. కేవ‌లం తెలుగులోనే కాకుండా, హింధి, ఇంగ్లీషు భాష‌ల్లోకూడా అంతే అన‌ర్గ‌ళంగా, అద్బుతంగా మాట్లాడే  అరుదైనా వ్య‌క్తిగా అని కొనియాడారు.

ఉపరా ష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంకయ్యనాయుడుకు సన్మానం చేసే అవకాశం తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వానికి దక్కడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.

‘ఇవాళ వెంకయ్య అత్యున్నతమైన శిఖరాన్ని అధిరోహించడం గొప్పగా ఉంది. అందుకు మనందరం గర్వించాలి. సీఎంగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తెలుగు వారికి, తెలుగు భాషకు గౌరవం దక్కిందని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు తెలుగు వ్యక్తి ఉపరాష్ర్టపతిగా బాధ్యతలు చేపట్టడం ఇంకా గర్వించదగ్గ విషయం,’ అని ఆయన ప్రశంసించారు.

ఉపన్యాసాన్ని పండించడంలో వెంకయ్యనాయుడు దిట్ట అని ప్రశంసించారు. ‘వ్యంగ్యం, హాస్యం, రౌద్రం అన్నీ కలిస్తేనే పరిపూర్ణమైన ఉపన్యాసం. ఇవన్నీ వెంకయ్య ఉపన్యాసంలో కనిపిస్తాయి.’ అని కెసిఆర్ వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి ఈ రోజు వెంకయ్యను ప్రశంసించడంలో తన సాహిత్య ప్రవేశం చేశారు. అనేక పద్యాలు ఉదహరిస్తూ తన ప్రసంగానికి పదునుపెట్టారు.

80వ ద‌శ‌కంలో ప‌రిచ‌యం

 1980వ ద‌శ‌కంలో వెంక‌య్య నాయుడు గురించి మొద‌ట తెల‌సిందని చంద్ర‌శేఖ‌ర్ రావు తెలిపారు. వెంక‌య్య‌ జైలు నుండి బ‌య‌టికి వ‌చ్చి... సిద్దిపేట‌లో ఆయ‌న ప్ర‌సంగాన్ని మొట్ట‌మొద‌టి సారి విన్నాన‌ని.. అద్బుత‌మైన వాక్చాతుర్యం క‌ల్గిన వ్య‌క్తి అని అప్పుడే అనిపించింద‌ని కేసీఆర్ తెలిపారు. ఆనాడు స‌భ‌లో ఎమ‌ర్జెన్సీకి వ్య‌తిరేకంగా ఆయ‌న‌ వ్యంగ్యంగా ప్ర‌సంగించారని తెలిపారు. ఆ ప్ర‌సంగం అమోఘమ‌ని గుర్తు చేశారు. 

రాజకీయంలో ప‌ద‌వులు అంతా అంతా ఈజీగా రావని ఎంతో కృషి, ప‌ట్టుద‌ల ఉంటేనే ప‌ద‌వులు వ‌స్తాయ‌ని, వాజ్‌పేయ్ హాయాంలో బీజేపి అధ్య‌క్షుడిగా మ‌న తెలుగు జాతి గౌవ‌రావాన్ని పెంచారు. దీని వెనక వెంకయ్యనాయుడు ఎంతో కృషి ఉందని చెప్పారు.  ఇప్ప‌డు మ‌న తెలుగు బిడ్డ వెంక‌య్య నాయుడికి ఉప రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి వ‌రించడం చాలా ఆనందంగా ఉంద‌ని తెలిపారు.

మరిన్నితాజా వార్తా విశేషాల కోసం క్లిక్ చెయ్యండి 

ఏషియానెట్-తెలుగు ఎక్స్ ప్రెస్ న్యూస్

 

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)