జేఏసి కొట్లాట కు అనుమతి

First Published Nov 28, 2017, 8:05 PM IST
Highlights
  • జేఏసి కొలువుల కొట్లాట సభకు అనుమతించిన పోలీసులు
  • సరూర్ నగర్ స్టేడియంలో సభ జరుపుకోడానికి అనుమతి

తెలంగాణ నిరుద్యోగుల కోసం జేఏసి తలపెట్టిన కొలువుల కొట్లాట సభకు ఎట్టకేలకు అనుమతి లభించింది. గతంలో కొలువుల కొట్లాట సభను నిర్వహించడానికి జేఏసి పలుమార్లు ప్రయత్నించినప్పటికి  పోలీసుల నుండి అనుమతి లభించలేదు. భద్రత కారణాలను చూపి అనుమతిని నిరాకరించారు. దీంతో జేఎసి హై కోర్టును ఆశ్రయించింది. దీంతో హై కోర్టు జోక్యం చేసుకుని సభకు అనుమతించాలని తెలంగాణ పోలీసులను ఆదేశించింది. దీంతో డిసెంబర్ 4 వ తేదీన కొట్లాట సభను నిర్వహించడానికి పోలీసు నుంచి అనుమతి లభించింది.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. అయినా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలపై దృష్టి సారించడం లేదన్నది జేఏసి వాదన. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగాల ఊసే లేదని జేఏసి పేర్కొంటూ నిరసనకు సిద్దమైంది. అందులో భాగంగా నిరుద్యోగులతో ఓ సభను నిర్వహించాలని ప్రయత్నించగా పోలీసులు అనుమతించలేదు. అనుమతి నిరాకరణపై  తెలంగాణ హోం మంత్రి నాయిని  వివరణ ఇస్తూ సభలో నక్సలైట్లు పాల్గొనే అవకాశం వున్నట్లు సమాచారం ఉన్నట్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  ఇలా తెలంగాణ అడుగడుగున కొలువుల కొట్లాట సభను అడ్డుకున్నారు.
అయితే దీనిపై జేఏసి హైకోర్టుకు వెళ్లగా జేఏసి సభకు అనుమతించాలని కోర్టు ఆదేశించింది. దీంతో పోలీసులు సరూర్ నగర్ లోని స్టేడియంలో డిసెంబర్ 4 వ తేదీన సభను నిర్వహించుకోడానికి అనుమతించింది. మద్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మద్య కొలువుల కొట్లాట సభను నిర్వహించుకోడానికి అనుమతించింది. 
 

click me!