కెసిఆర్ పై ఏపిలో మండిపోతున్నారు.. ఎందుకో తెలుసా ? (వీడియో)

First Published Nov 28, 2017, 7:48 AM IST
Highlights
  • తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ పై ఏపి జనాలు మండిపోతున్నారా? అవుననే సమాధానం చెప్పుకోవాలి.

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ పై ఏపి జనాలు మండిపోతున్నారా? అవుననే సమాధానం చెప్పుకోవాలి. రాజకీయ నేతలే కాకుండా అధికార వర్గాల్లో కూడా ఇపుడు కెసిఆర్ చేసిన పనిపైనే చర్చ జరుగుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే, మంగళవారం అంటే ఈరోజు మధ్యాహ్నమే ప్రతిష్టాత్మక మెట్రో రైలు వ్యవస్ధ ప్రారంభం అవుతున్న విషయం అందరికీ తెలిసిందే కదా? ప్రధానమంత్రి నరేంద్రమోడి మెట్రోను ప్రారంభిస్తున్నారు. అందుకు తెలంగాణా ప్రభుత్వం అత్యంత భారీ ఏర్పాట్లు చేసింది. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కాబట్టి ఏర్పాట్లు కూడా ఘనంగా చేయటంలో తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు.

                                                    చంద్రబాబును ఎందుకు పిలవాలి ?

కానీ అంత ఘనమైన ఏర్పాట్లు చేస్తున్న కెసిఆర్ ప్రభుత్వం ఆహ్వానితుల వద్దకు వచ్చేసరికి కొద్ది బుద్ధులు ప్రదర్శిస్తుండటంపైనే అందరూ మండిపడుతున్నారు. ఇంతటి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆహ్వానం లేకపోవటమే పెద్ద వెలితిగా కనిపిస్తోంది. చంద్రబాబును కార్యక్రమానికి పిలవాలని చెప్పటానికి కొన్ని కారణాలున్నాయి.

అసలు హైదరాబాద్ మెట్రోకు 2002లో రూపకల్పన చేసిందే చంద్రబాబు. తర్వాత వచ్చిన వైఎస్ ప్రభుత్వంలో కూడా పనులు బాగానే జరిగాయి. 2009లో వైఎస్ మరణించాక  ఊపందుకున్న ప్రత్యేక తెలంగాణా ఉద్యమం కారణంగానే మెట్రో పనుల్లో జాప్యం జరిగింది. వాస్తవానికి 2014లో తెలంగాణా రాష్ట్రం ఏర్పడేనాటికే పనులు చాలా వరకూ అయిపోయాయి. మిగిలిపోయిన పనులను కెసిఆర్ ప్రభుత్వం పూర్తి చేసిందంతే. ఇప్పుడింత ఘనంగా మెట్రో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్న కెసిఆర్, ఉద్యమ సమయంలో ఇదే మెట్రోను పూర్తిగా వ్యతిరికించారు.

                                                           స్నేహ ధర్మం తప్పిన కెసిఆర్

సరే చరిత్రను పక్కనపెట్టినా, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్న విషయం తెలుసు కదా? ప్రోటోకాల్ ప్రకారమైనా చంద్రబాబుకు ఆహ్వానం పంపితే బాగుండేది. అదే సమయంలో అమరావతి శంకుస్ధాపనకు కెసిఆర్ ను పిలవటం ద్వారా చంద్రబాబు స్నేహధర్మాన్ని పాటించారు. మరి అదే ధర్మాన్ని కెసిఆర్ పాటించలేదు

. ఇక్కడే ఏపిలో అధికార, అనధికార వర్గాలకు మండుతోంది. చంద్రబాబును కార్యక్రమానికి పిలిచినంతమాత్రాన కెసిఆర్ కు వచ్చే నష్టం ఏమీలేదు. అసలు చంద్రబాబు సెల్ఫ్ ప్రమోషన్ కు భయపడే కెసిఆర్ ఏపి సిఎంను దూరం పెట్టారా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఏదేమైనా కెసిఆర్ చేసిన పని మాత్రం ఎవరికీ నచ్చలేదు.

 

click me!