
శృంగార తార సన్నీ లియోన్ నటించిన కండోమ్ యాడ్స్ పై గోవా అసెంబ్లీలో రచ్చ జరిగింది. సన్నీ లియోన్ నటించిన కాండోయ్ యాడ్ ను బస్సుల్లో ప్రదర్శించరాదని, తక్షణమే ఆపాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆండ్రీ ఫ్రాన్సిస్ సిల్వీరా అసెంబ్లీలో డిమాండ్ చేశారు.
లక్షలాది మంది ప్రయాణిస్తున్న బస్సుల్లో సన్నీలియోన్ కాండోమ్‌లను ప్రదర్శించడం మనకు సిగ్గుచేటు అని ఆండ్రీ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు. కుటుంబాలు తమ పిల్లలతో కలసి ప్రయాణిస్తుంటారు. చూడటానికి అసభ్యకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఇలాంటి యాడ్స్ గోవా ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నాయని ప్రశ్నించారు. ప్రజల రవాణా కోసం ఉపయోగించే బస్సుల్లో ఇలాంటి యాడ్స్ వేయడం సరికాదన్నారు. అంతేకాదు తక్షణమే వాటిని తొలగించాలని మనోహార్ పారికర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.