చైతూ అమ్మమ్మ చీరలో సమంత?

Published : Aug 02, 2017, 03:43 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
చైతూ అమ్మమ్మ చీరలో సమంత?

సారాంశం

రెండు సంప్రదాయాల ప్రకారం పెళ్లి పెళ్లి దుస్తులను డిజైన్ చేస్తున్న  ప్రముఖ డిజైనర్ క్రిషా బజాజ్ డిజైన్

 

టాలీవుడ్ ప్రేమ జంట అక్కినేని నాగచైతన్య, సమంతలు వివాహ బంధంతో ఒకటి కానున్నారు.

వీరి వివాహం గోవాలో అక్టోబర్ 6 నుంచి 9 వరకు జరుగనుందన్న విషయం అందరికీ తెలిసిందే.  అంతేకాదు ఈ పెళ్లిని రెండు సంప్రదాయాల ప్రకారం జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట క్రిస్టియన్ పద్దతిలో చర్చిలో, తరువాత తెలుగు సంప్రదాయం ప్రకారం జరుగుతుంది.

 కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారట. ఇప్పటికే పెళ్లి సమయంలో వధూవరులు ధరించే దుస్తులను ప్రముఖ డిజైనర్ క్రిషా బజాజ్ డిజైన్ చేస్తున్నట్టు సమాచారం. తాజాగా సమంత పెళ్లి చీర గురించి ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది...పెళ్లిలో సమంత.. నాగచైతన్య అమ్మమ్మ రాజేశ్వరీ దేవి( రామానాయుడు భార్య) చీరను కట్టుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

 

ఆ పాత చీరపై బంగారు జరీ అంచుతో వర్క్ చేసి సరికొత్తగా ఆవిష్కరించేందుకు క్రిషా బజాజ్ చాలా వర్క్ చేస్తోందని ఫిల్మ్ నగర్ వర్గాలు మాట్లాడుకుంటున్నారు. గతంలో సమంత ఎంగేజ్మెంట్ చీర విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తమ ప్రేమ కథ తెలిసేలా డిజైన్ చేయించుకున్న విషయం తెలిసిందే కదా..

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)