పీఎస్‌ఎల్‌వీ సీ–39 ప్ర‌యోగం విఫ‌లం

First Published Aug 31, 2017, 7:52 PM IST
Highlights

పీఎస్‌ఎల్‌వీ సీ–39 ప్ర‌యోగం విఫ‌లం.

నాలుగవ దశలో ఉష్ణ కవచం వేరుపడలేదు.

విఫలం అయిందని ప్రకటించిన ఇస్రో చైర్మన్ కిరణ్ కూమార్.

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి ప్రవేశపెట్టిన పీఎస్‌ఎల్‌వీ సీ–39 రాకెట్ ప్రయోగం విఫలమైంది. 29 గంట‌ల కౌంట్ డౌన్ అనంత‌రం నిప్పులు చిమ్ముతూ నింగికి దూసుకెళ్లింది. ఈ రాకెట్‌ ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌–1 హెచ్ (రీప్లేస్‌మెంట్‌) గా ఉపగ్రహాన్ని క‌క్ష‌లో ప్ర‌వేశ‌పెట్టాలనుకున్నారు. అయితే, పీఎస్‌ఎల్‌వీ సీ–39 నుంచి ఉష్ణకవచం వేరుపడలేదు. 1,425 కిలోల బరువున్న ఈ ఉపగ్రహం విజయవంతం అయితే నావిగేషన్ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చేవి. పీఎస్‌ఎల్‌వీ సీ–39 రాకెట్ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టలేకపోయిందని ఇస్రో ఛైర్మన్ కిరణ్ కుమార్ ప్రకటించారు. సాంకేతిక లోపం కారణంగా హీట్ షీల్డ్ విడిపోలేదని వివరణ ఇచ్చారు.

ఇప్పటి వ‌ర‌కు నావిగేషన్‌ వ్యవస్థ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఏడు ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపింది. ఇందులో 2013లో పంపిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఏ ఉపగ్రహంలోని మూడు పరమాణు గడియారాలు మొరాయించి సేవలందడం లేదు. దాని స్థానంలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1హెచ్‌ను పంపేందుకు ప్ర‌య‌త్నించిన ఈ రాకెట్‌ ప్రయోగం విఫలమైంది. 

click me!