
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ–39 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగికి దూసుకెళ్లింది. ఈ రాకెట్ ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్–1 హెచ్ (రీప్లేస్‌మెంట్) ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం నిన్న మధ్యాహ్నం కౌంట్‌డౌన్ ప్రారంభం అయింది. 29 గంటల పాటు కౌంట్ డౌన్ కొనసాగింది. పీఎస్‌ఎల్‌వీ సీ–39 మోసుకెళుతోన్న ఈ ఉపగ్రహం బరువు 1,425 కిలోలు. నావిగేషన్ వ్వవస్థను మరింత బలోపెతం అవుతుంది.