
నేపాల్ రాజధాని ఖాట్మండ్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. యూఎస్-బంగ్లా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఖాట్మాండులోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ విమాన ప్రమాదంలో దాదాపై 50 మంది చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఢాకా నుండి 71 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానం ఖాట్మండ్ లో ల్యాండవుతుండగా అకస్మాత్తుగా రన్ వే పై విమానం జారింది. దీంతో ప్లేన్‌కు మంటలు అంటుకుని రన్‌వే పక్కన ఉన్న ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో కూలింది. ఈ ప్రమాదంనుండి 17 మంది ప్రయాణికులను కాపాడినట్లు తెలిపిన అధికారులు తెలిపారు. అగ్రిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. మంటలు అదుపులోకి వచ్చి విమాన శిథిలాలను తీస్తే కానీ ఎంతమంది చనిపోయారన్న దానిపై క్లారిటీ రాదని విమానయాన అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదం కారణంగా ప్రస్తుతం ఖాట్మండు విమానాశ్రయాన్ని మూసివేశారు.