ట్రాఫిక్ లో జరిగిన గొడవ కత్తుల దాడికి దారితీసింది

Published : Mar 12, 2018, 03:00 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
ట్రాఫిక్ లో జరిగిన గొడవ కత్తుల దాడికి దారితీసింది

సారాంశం

సికింద్రాబాద్ లో ఇద్దరు యువకులపై కత్తులతో దాడి ట్రాఫిక్ లో ఏర్పడ్డ చిన్న వివాదమే కారణం

మితిమీరిన వేగంతో బైక్ పై వెళుతున్న ఓ యువకుడికి చూసుకుని వెళ్లమని సలహా ఇచ్చినందుకు కత్తులతో దాడిచేసి గాయపర్చిన సంఘటన సికింద్రాబాద్ లో చోటుచేసుకుంది. ఈ దాడిలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పట్టపగలే నడి రోడ్డుపై ఎప్పుడూ రద్దీగా ఉండే రెజిమెంటల్ బజార్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. దీనికి సంబంధిచిన వివరాలిలా ఉన్నాయి.   

మారేడుపల్లికి చెందిన యువకులు శంకర్‌(21), శ్రీనాథ్‌(20)లు పుస్తకాలు కొనడానికి  బైక్ పై సికింద్రాబాద్‌ బయలుదేరారు. అయితే వీరు సంగీత్ చౌరస్తా వద్దకు రాగానే ఓ యవకుడు మితిమీరిన వేగంతో బైక్ పై వెళుతూ ప్రమాదకర రీతిలో వీరిని ఓవర్ టేక్ చేశాడు. దీంతో వీరు ఆ యువకుడిని మందలించే ప్రయత్నం చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఆ యువకుడు అతడి వద్దగల కత్తితో ఇద్దరిపై దాడి చేశాడు. శ్రీనాథ్ ను కడుపులో, శంకర్ ను మెడపై కత్తితో పొడిచి అక్కడినుండి పరారయ్యాడు.

ఈ దాడి విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు గాయపడిన విద్యార్థులను గాంధీ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వ్యక్తిని గుర్తించి పట్టుకునేందుకు ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో ఉన్న రికార్డులను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)