ట్రెక్కింగ్ కు వెళ్లి మంటల్లో సజీవదహనమైన 9 మంది విద్యార్థులు (వీడియో)

First Published Mar 12, 2018, 1:17 PM IST
Highlights
  • తమిళనాడు ఘోర ప్రమాదం
  • మంటల్లో చిక్కుకుని 9 మంది విద్యార్థుల సజీవ దహనం
  • ట్రెక్కింగ్ కి వెళ్లి మంటల్లో చిక్కుకున్న విద్యార్థులు

అడవిలో సాహస యాత్రకు వెళ్లిన విద్యార్థులు కార్చిచ్చు కారణంగా సజీవ దహనయైన సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తమిళనాడు- కేరళ సరిహద్దులోని తెనీ జిల్లాలోని కురంగని అటవీ ప్రాంతంలో ఆ విషాద సంఘటన జరిగింది. ఈ అగ్గికి 9 మంది విద్యార్థులు ఆహుతైనట్లు సమాచారం. మరో 26 మందిని అధికారులు కాపాడారు. అటవిలో చిక్కుకున్న మరికొంతమందిని కాపాడటానికి వాయుసేన హెలికాప్టర్లతో సహాయక చర్యలు చేపట్టారు. అర్థరాత్రి నుండి మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. దీంతో ప్రమాద మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  చెన్నై ట్రెకింగ్ క్లబ్ కి చెందిన దాదాపు 35 మంది సభ్యులు కురంగని అటవీ ప్రాంతంలో ట్రెకింగ్ కు వెళ్లారు. వీరిలో దాదాపు 25 మంది వరకు అమ్మాయిలు ఉన్నట్లు సమాచారం. వీరు రాత్రి సమయంలో అడవిలో గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఆదివారం అర్థరాత్రి సమయంలో ఒక్క సారిగా మంటలు చెలరేగి గుడారాలకు అంటుకున్నాయి. దీంతో కొందరు ఆ మంటల్లో సజీవదహనమయ్యారు. ఈ మంటల నుండి తప్పించుకున్న మరికొంతమంది అటవీ శాక అధికారులకు సమాచారం అందించారు. దీంతో  హుటాహుటిన సంఘటన జరిగిన అటవీ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది విద్యార్థులను కాపాడటానికి ప్రయత్నించారు.  అలాగే వాయుసేనకు చెందిన మూడు హెలికాప్టర్లు కూడా విద్యార్థులను కాపాడటానికి ప్రయత్నిస్తున్నాయి. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న  తమిళ నాడు సీఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం లు కురుంగని అటవీ ప్రాంతానికి చేరుకుని సహాయకచర్యలు పర్యవేక్షిస్తున్నారు.  ఈ ప్రమాదంలో చెన్నైకి చెందిన అఖిల, ప్రేమలత, పునిత, సుధ, అరుణ, విబణి, ఈరోడ్ కు చెందిన దివ్య, వివేక్, తమిళ సెల్వి మృతిచెందినట్లు అధికారులు గుర్తించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

వీడియో

click me!