నిరుద్యోగ భృతి ఇస్తాం.. బట్ కండిషన్స్ అప్లై..

Published : Jul 28, 2017, 12:36 PM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
నిరుద్యోగ భృతి ఇస్తాం.. బట్ కండిషన్స్ అప్లై..

సారాంశం

35 లోపు వయసు గల వారే నిరుద్యోగులు  ఇంటర్‌లోపు వారికి రూ.900  డిగ్రీ చదివిన నిరుద్యోగులకు రూ.1500  పిజి చదివిన వారికి రూ.3000 

 

 

2014 ఎన్నికల పర్వం ముగిసింది. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టగానే.. తాను ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఐదు వాగ్ధానాలను నిలబెట్టుకుంటున్నట్లు సంతకాలు కూడా చేశాడు. వాటిలో ఒకటి నిరుద్యోగ భృతి.

‘బాబు వస్తే... జాబు వస్తుంది’ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు. అయితే.. ఆయన అధికారంలోకి అడుగుపెట్టి మూడు సంవత్సరాలు పూర్తయ్యింది. కానీ..ఉద్యోగమూ రాలేదు.. నిరుద్యోగులకు ఉద్యోగ భృతి కూడా రాలేదు. మళ్లీ ఎన్నికలకు  రంగం సిద్ధమౌతోందనగా... బాబుకు తాను చేసిన వాగ్ధానం గుర్తు వచ్చినట్లుంది. అందుకే నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఆయన చేసిన వాగ్ధానం మేరకు నిరుద్యోగులకు భృతి ఇస్తే హర్షదాయయకమే.. కానీ ఇందులోనూ తమకు వీలుపడే లొసుగులను ప్రభుత్వం వెతుకుతోంది. ఉపాధి కల్పన కార్యాలయాల్లో పేర్లు నమోదు చేయించుకున్నవారినే నిరుద్యోగులుగా గుర్తిస్తారట. మరి నమోదు చేసుకోని వాళ్లు నిరుద్యోగుల కిందకు రారా.. అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అది కూడా 18 నుంచి 35 సంవత్సరాల వయసు లోపు వారికే కావడం గమనార్హం.

 

అంతేకాదు.. అసలు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 9లక్షల మందే నిరుద్యోగులుగా ఉన్నారట.. వీరిలో పదో తరగతి లోపు విద్యార్హత గల వారు 22,195 మంది. పదో తరగతి పాసైన వారు 2,45,673 మంది, ఇంటర్‌ పాసైన వారు 2,56,658 మంది, డిగ్రీ పాసైనవారు 2,63,280 మంది, అంతకన్నా ఎక్కువ, వృత్తి విద్య చదివిన వారు 92,878 మంది ఉన్నట్లు నిర్ధారించారు.

ఇరటర్మీడియేట్‌ కన్నా తక్కువ చదివిన వారికి నెలకు రూ.900, గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.1500, పోస్టు గ్రాడ్యుయేషన్‌ తదితర విద్యాభ్యాసం చేసిన వారికి నెలకు రూ.3వేల చొప్పున భృతిగా చెల్లించాలని యోచిస్తున్నారు.

ఇందులోనూ నియమ నిబంధనలు వర్తిస్తాయి..ముందుగా ఒక కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే భృతి ఇస్తారట.. అది కూడా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి మాత్రమేనట. విద్య పూర్తి చేసుకుని, ఉద్యోగం కోసం వేచి చూస్తున్నవారే తప్ప.. చదువుకుంటున్న వారిని అనర్హులుగా తేల్చేశారు. ప్రైవేటు ఉద్యోగాలు, స్వయం ఉపాధి పొందుతున్న వారు కూడా అనర్హులేనట. గతంలో ఒక ఉద్యోగిగా ఉంటూ డిస్మిస్‌ అయిన వారు, నేరాల్లో పాత్రధారులు, శిక్ష అనుభవించిన వారు నిరుద్యోగుల కిందకు రారని స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకున్న వారిలో వయసు ఎక్కువగా ఉన్న వారికి తొలి ప్రాధాన్యత ఉంటుందని... శిక్షణ సమయంలో వరుసగా రెండు సార్లు గైర్హాజరైతే భృతి నుంచి సస్పెండ్ చేస్తారంట. ఇన్ని కండిషన్లు తట్టుకొని.. నిరుద్యోగిగా నిలబడిన వారికే.. బాబు ఇచ్చే భృతి అందుతుంది.

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)