మీరు మా ప్రధాని అయితే బాగుండేది

First Published Jul 28, 2017, 11:06 AM IST
Highlights
  • పాక్ లోనూ సుష్మాకి అభిమానులు
  • పాక్ మహిళకు సాయం చేసిన సుష్మా
  • సుష్మా స్వరాజ్ పై పొగడ్తల వర్షం

 కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ ప్రజలకు సోషల్ మీడియా ద్వారా కూడా సేవలు అందిస్తున్నారు. ఆమె చేస్తున్న సేవలకు, సాయం చేసే గుణానికి  నిన్నటి వరకు మన భారతీయులు మాత్రమే ఆమెకు అభిమానులుగా ఉండేవారు. ఇప్పటి నుంచి ఆమెకు పాక్ లో కూడా అభిమానులు చేరిపోయారు.

వివరాల్లోకి వెళితే..ఇటీవల ఓ పాక్‌కి చెందిన హిజాబ్‌ అసీఫ్‌ అనే మహిళ కాలేయ సమస్యతో బాధపడుతోంది. వెంటనే ఆమె భారత్‌లో చికిత్స చేయించుకోవాల్సి ఉంది. ఇందుకోసం హిజాబ్‌ మెడికల్‌ వీసా కోసం ఇస్లామాబాద్‌లోని డిప్యూటీ హైకమిషనర్‌ను ఆశ్రయించింది. కానీ ఇందుకు కమిషనర్‌ ఒప్పుకోలేదు. దాంతో హిజాబ్‌ సుష్మా స్వరాజ్ కు ట్వీట్ చేసింది.

‘మేడమ్‌.. నాకు కాలేయ సమస్య ఉంది. భారత్‌లో చికిత్స చేయించుకోవాలి. మెడికల్‌ వీసా కావాలని అడిగితే అది మీరే చూసుకోవాలని అంటున్నారు. నాకు సాయం చేయండి’ అని ట్వీట్‌చేసింది. వెంటనే స్పందించిన సుష్మా.. మెడికల్‌ వీసా వచ్చేలా ఆదేశాలు జారీ చేశారు.

వెంటనే స్పందించి తనకు సాయం చేసిన సుష్మాపై హిజాబ్‌ ప్రశంసల జల్లులు కురిపించింది. మీ మంచితనాన్ని వివరించడానికి మాటలు రావడంలేదు. లవ్యూ మేడమ్‌. నా గుండె మీకోసమే కొట్టుకుంటోంది.మీరు మా ప్రధాని అయివుంటే ఎంత బాగుండో. అయినా మీలాంటి ప్రధానిని పొందే అర్హత పాక్‌కు లేదని హిజాబ్ ట్విట్టర్ వేదికగా పేర్కొంది.

click me!