పన్ను ఎగవేస్తున్నారా... ఫేస్ బుక్ పట్టేస్తుంది..!

Published : Jul 28, 2017, 11:39 AM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
పన్ను ఎగవేస్తున్నారా... ఫేస్ బుక్ పట్టేస్తుంది..!

సారాంశం

సోషల్ మీడియా ద్వారా పన్ను ఎగవేత దారుల పట్టివేత కొత్త విధానాన్ని అమలులోకి తేనున్న కేంద్ర ప్రభుత్వం

‘ రమేష్.. ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఇటీవలే కొత్త మోడల్ కారు కొన్నాడు. ఆ కారులో ఫ్యామిలీతో సరదాగా లాంగ్ డ్రైవ్ కి కూడా వెళ్లాడు. అక్కడ దిగిన ఫోటోలను ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు చేశాడు.’ కారుకు సంబంధించి పన్ను మాత్రం చెల్లించలేదు.ఇలా అంతకముందు కారు కొన్నప్పుడు కూడా చేశాడు. కానీ ఎలాంటి సమస్య ఎదురుకాలేదు. కానీ ఇప్పుడు అలా కాదు. తాను సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటోలు చూసిన అధికారులు మరుసటి రోజు తన ఇంటికి వచ్చి మరి పన్ను చెల్లించాల్సిందిగా కోరారు. దీంతో వెంటనే పన్ను కట్టాల్సి వచ్చింది.’ ఏమిటి ఇదంతా అనుకుటున్నారా.. పన్ను ఎగవేత దారులను పట్టుకునేందుకు ప్రభుత్వం కొత్త దారులను కనుగొంటోంది.

 

ఇప్పటి వరకు బ్యాంక్ ల ద్వారా పన్ను ఎగవేత దారులను పసిగట్టేవారు. ఇక వచ్చే నెల నుంచి మోదీ ప్రభుత్వం  సాంప్రదాయ పద్దతులలో మాత్రమే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా వీరిని కనుగోనున్నారు. సంప్రదాయ పద్ధతులను అవలంభించడం ద్వారా చాలా మంది పన్ను ఎగవేత దారులను పట్టుకోలేక పోతున్నామని సంబంధిత అధికారులు తెలిపారు. వీటితోపాటు సోషల్ మీడియాను కూడా అనుసరిస్తే.. పూర్తి  సమాచారం తెలుసుకోగలిగే అవకాశం ఉంటుందని.. అందుకే త్వరలో ఈ పద్ధతిని ఆచరణలో పెట్టనున్నట్లు వారు చెప్పారు.

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)