అదే పనిగా హారన్ కొడుతున్నారా.. జాగ్రత్త !

First Published Aug 2, 2017, 10:44 AM IST
Highlights
  • అదే పనిగా హారన్ మోగించడం అనారోగ్యమేనట
  • మీ మానసిక స్థిని తెలియజేస్తుంది

 అర్జంట్ గా ఆఫీస్ కి వెళ్లాలి... వెళుతుంటే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మీ ముందు ఉన్న వాహనం ఎంత సేపటికీ కదలడం లేదు.. ఓపిక నశించిపోయి.. హారన్ మోగించేస్తున్నారా..అలా చేసే ముందు ఒక్క క్షణం ఆగండి.  హారన్ అదే పనిగా మోగించడం అంటే మీరు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని అర్ధమట. అవసరం లేని సందర్భంలో హారన్ కొట్టినా.. ఎటువంటి ఉపయోగం లేదని తెలిసినా మీ అసహనాన్ని తెలియజేయడానికి హారన్ మోగించకూడదట. అలా చేస్తున్నారంటే.. మీ మానసిక పరిస్థితి గురించి ఓ సారి ఆలోచించాల్సిందే.

 

పలువరు మానసిక శాస్త్రవేత్తలు ఈ విషయంపై పరిశోధన చేశారు. పలువరిపై చేసిన ఈ పరిశోధనలో పలు ఆసక్తికర విషయాలు వెలువడ్డాయి. ట్రాఫిక్ హెవీ గా ఉన్నప్పుడు.. ఏ వాహనమైనా కదలడం కష్టమే కదా.. అలాంటి సమయంలో హారన్ మోగించడం వల్ల వాహనాలు కదలకపోగా.. శబ్ధ కాలుష్యం ఏర్పడుతుంది. అత్యవసర సమయంలో మాత్రమే హారన్ ఉపయోగించాలి. అదే పనిగా  చేస్తే అది ఒక మానసిక సమస్య గా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

click me!