రెండు తెలుగు రాష్ట్రాల సీఎస్ లకు నోటీసులు

First Published Feb 22, 2018, 6:13 PM IST
Highlights
  • తెలుగు రాష్ట్రాల సీఎస్ లకు హెచ్చార్సీ నోటీసులు
  • విద్యార్థుల ఆత్మహత్యల పై  వివరణ కోరిన హెచ్చార్సీ 

ఇరు తెలుగు రాష్ట్రాల సీఎస్ లకు నేషనల్ హ్యామన్ రైట్స్ కమీషన్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రైవేట్ కళాశాలల ఒత్తిడే కారణమంటూ కొందరు ఎన్‌హెచ్‌ఆర్సీ ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన హెచ్చార్సీ విద్యార్థుల ఆత్మహత్యలకు గల కారణాలపై వివరణ ఇవ్వాల్సిందిగా సీఎస్ లకు సూచించింది.

ఇటీవల ప్రైవేట్,కార్పోరేట్ స్నూళ్లు, కాలేజీలలో చదువుల పేరుతో విద్యార్థులపై ఒత్తిడి పెరిగింది. దీంతో అటు తల్లిదండ్రుల ఒత్తిడి, ఇటు కాలేజీలో ఒత్తిడిని తట్టుకోలేక వేధనతో చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్కన విషయం తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కార్పోరేట్ చదువులంటేనే విద్యార్థలు భయపడే పరిస్థితి ఏర్పడింది. ఈ మద్యకాలంలో అయితే ఏకంగా కళాశాల హాస్టల్లలో విద్యార్థులు చనిపోయిన ఘటనలు అనేకం జరిగాయి. ఓ విద్యార్థిని ఈ ఒత్తిడిని తట్టుకోలేక ఈ కాలేజీలో నేను చదవలేనంటూ లెటర్ రాసిపెట్టి పారిపోయిన సంఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇలా విద్యార్థుల ఆత్మహత్యలకు కార్పోరేట్ చదువులే కారనమని స్పష్ట్ంగా తెలుస్తున్నా ఈ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వాటిని నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

దీంతో  సుప్రీంకోర్టు న్యాయవాది శ్రవణ్‌ కుమార్‌ ఈ విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రైవేట్‌, కార్పొరేట్‌ కాలేజీల ఒత్తిళ్లే దారితీస్తున్నాయంటూ  ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్సీ... నాలుగు వారాల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని ఇరు రాష్ట్రాల సీఎస్‌లకు ఆదేశించింది.

click me!