
పాత కాలంలో స్మగ్లింగ్ చెయ్యడంలో కొన్ని ప్రత్కేక పద్దతులు ఉపయోగించేవారు. పాత సినిమాల్లో స్మగ్లింగ్ పద్దతులు ఆర్డీనరీగా ఉండేవి. కానీ ఇప్పడు స్మగ్లర్లు అనుసరిస్తున్న పద్ధతులు చూస్తే దిమ్మతిరగక మానదు. విదేశాల నుండి డైమండ్‌లు, బంగారం పలు ఖరీదైన వస్తువులను తీసుకురావడానికి నేడు చాలా కష్టం. అయితే కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి దేశంలోకి తీసుకురావడానికి అనుసరిస్తున్న పద్దతులు రోజు రోజుకి మారిపొతున్నాయి.
ముంబాయి ఎయిర్ పోర్టులో మంగళవారం ఒక స్మగ్లింగ్ ముఠా పట్టుబడింది. ఇద్దరు తమ సాంసంగ్ ఫోన్‌లలో 80 లక్షల విలువైన బంగారాన్ని రవాణా చేస్తు దొరికిపోయారు. తమ ఫోన్లలోని బ్యాటరీలను తీసేసి ఆ ప్రదేశంలో బంగారాన్ని నింపారు. అదే ముఠాకు చెందిన మరొకరు మిక్సీ కి కింది భాగంలో 2 కోట్ల విలువైన డైమండ్లను స్మగ్లింగ్ చేస్తు కస్టమ్స్ అధికారులకు దొరికిపోయ్యారు. వీరితో పాటు మరో ఇద్దరు కూడా బంగారాన్ని ఫోన్ చార్జర్ భాగంలో పెట్టి ఇండియాలోకి తీసుకొస్తూ పట్టుబడ్డారు.
వీరు నలుగురు దుబాయ్ నుండి వచ్చారు.కానీ ఒకరికి తెలియకుండా ఒకరు చాలా జాగ్రత్తగా ఇండియా చేరుకున్నామనివారు సంబర పడుతుండగా కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యారు.