బెంగుళూరు లో ‘పింక్‌ సమారిటన్‌ పింక్‌ హీరోస్‌’ ఉత్సవం.

First Published Nov 9, 2017, 1:07 PM IST
Highlights
  •  మహిళా సాధికారిత కోసం సుదీర్ఘకాలంగా కృషి చేస్తున్న ఈస్ట్రన్‌ కండిమెంట్స్‌.
  •  ఈ ప్రయత్నాలకు కొనసాగింపుగా ఏసియానెట్‌ న్యూస్‌ భాగస్వామ్యంతో చేపట్టిన సరి కొత్త కార్యక్రమం.
  •  " పింక్‌ సమారిటన్‌ పింక్‌ హీరోస్‌" 

  ఈస్ట్రన్‌ కండిమెంట్స్‌, ఏసియా నెట్‌ న్యూస్‌ నవంబర్‌ 07, 2017 న నిర్వహించిన పింక్‌ సమారిటన్‌ పింక్‌ హీరోస్‌ ఉత్సవం విశేషాలు

 మహిళా సాధికారిత కోసం సుదీర్ఘకాలంగా కృషి చేస్తున్న ఈస్ట్రన్‌ కండిమెంట్స్‌ తన ఆ ప్రయత్నాలకు కొనసాగింపుగా ఏసియానెట్‌ న్యూస్‌ భాగస్వామ్యంతో చేపట్టిన సరి కొత్త కార్యక్రమం " పింక్‌ సమారిటన్‌ పింక్‌ హీరోస్‌" .

వ్యక్తులుగా, సంస్థల్లో భాగస్వాములుగా మహిళలకు సంబంధించిన అంశాలపై సాధికారిత చోదకశక్తులుగా పనిచేసిన పురుషులకు అందించే గౌరవమే ఈ పింక్‌ హీరోస్‌.
ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు  ఇక్కడ చూడవచ్చు.

   

               

   

 

 

 

ఈస్ట్రన్‌ బృందం, ఏసియానెట్‌ న్యూస్‌ సంయుక్తంగా మహిళలహక్కులకు సంఘీభావంగా నిలుస్తున్న పురుషులతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బెంగళూరులోని ఛాన్సరీ హోటల్‌ వేదికయ్యింది.

సాయంత్రవేళ "ఆమె కోసం అతడు" పేరిట నిర్వహించిన  మేధో చర్చలో బ్రాండ్‌గురు హరీష్‌ బిజూర్‌, ఫ్యాషన్‌ ప్రదర్శనకారుడు ప్రసాద్‌ బిడప్ప, ఎస్‌విపి ఇంట్యూట్‌ విజయ్‌ ఆనంద్‌మ, నమ్మ బెంగళూర్ ఫౌండేషన్‌ సీఈవో శ్రీధర్‌ పబ్బిశెట్టి తదితరులు పాల్గొన్నారు.  చర్చకు ఏసియానెట్‌ న్యూస్ మీడియా సీఎంఓ ఇందుశేఖర్‌ చంద్రశేఖర్‌ సంధానకర్తగా వ్యవహరించారు.

హరీష్‌ బిజూర్‌లో ఆలోచన మేరకు వచ్చే ఐపీఎల్‌ నుంచి ఇద్దరు మహిళలను జట్టులో చేర్చడం,  భద్రతకు మారుపేరుగా పేరున్న బెంగళూరులో చోటుచేసుకున్న ఘటనలపై ప్రసాద్‌ బిదప్ప వ్యాఖ్యలు, సామాజిక, సాంస్కృతిక పరివర్తనపై శ్రీధర్‌ పబ్బిశెట్టి విశ్లేషణ, పనిచేసే ప్రదేశాల్లో మహిళా వ్యతిరేక భావనల్లో మార్పుల ఆవశ్యకతపై విజయ్‌ఆనంద్‌ సూచనలు, మహిళలకు మరింత అందమైన ప్రపంచాన్ని అందించడంలో పురషుల విశ్లేషణాత్మక పాత్ర, తదితరాంశాలపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. 

సాయంత్రం కార్యక్రమం ప్రధాన అజెండా మహిళలకు సంబంధించిన అంశాల్లో విస్తృత కృషి చేసిన ముగ్గురు జెంటిల్‌మెన్‌లను స‌త్కరించారు.
ఆ ముగ్గురు పింక్ హీరోలు...

 

విజయ్‌ ఆనంద్‌ - ఎస్‌విపి గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్స్‌, మహిళల పరంగా ఉత్తమకార్పొరేట్ పౌరుడిగా నిలిచిన వ్యక్తి. ఇటీవల  భారత్‌లోనే పని చేయడానికి నెంబర్‌-1 నిలిచిన సంస్థతో ప్రత్యక్ష భాగస్వామ్యం ఉన్న వ్యక్తి. 

ఎం.జి, నరేంద్రకుమార్‌ - డిసిపి. బెంగళూరు నగరం, ప్రస్తుతం బెంగళూరు నగరం కమాండ్‌ సెంటర్‌ అధిపతిగావ్యవహరిస్తున్నారు. సురక్ష యాప్‌, పింక్‌ హొయసలా కార్యక్రమంపై ఎంతో కృషి చేశారు. నిషిత్‌ రస్తోగీ, వ్యవస్థాపకుడు, సీఈవో, లోకస్‌.ఎస్‌హెచ్‌, రైడ్‌ సేఫ్‌ యాప్‌ ద్వారా మహిళ ల్లో భద్రతా భావం పెంపొందించేలా కృషి చేశారు.

అనంతరం ఈస్ట్రన్ కండిమెంట్స్ సంస్థ  ఎండీ ఫిరోజ్ మీరన్ మాట్లాడుతూ.. “ ఈ విషయంలో మహిళలతో పాటు మహిళల కోసం పనిచేస్తున్నందుకు ఈస్ట్రన్‌ ఎంతో గర్వపడుతోంది. సమాజంలోని ప్రతిఒక్క పౌరుడు మంచి మార్పు దిశగా చొరవ చూపే బాధ్యత కలిగి ఉన్నారన్న మా నమ్మకానికి ప్రతీకగానే అద్భుతమైన వ్యక్తులకు ఈ పింక్‌ హీరోస్‌ సత్కారం అందిస్తున్నాం’’

ఏషియానెట్ న్యూస్ మీడియా ఎంటర్ టైన్ మెంట్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఇందుశేఖర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ‘‘ఈ అసమానతల ప్రపంచంలో సమానత్వం కోసం కృషి చేస్తూ... మహిళల ప్రయోజనా ల కోసం చేయూతనిస్తూ... ఆ కార్యక్రమాలకు మద్ధతుగా నిలుస్తున్న వారిలో అత్యుత్త మైన వారినే ఈ పింక్‌ హీరోస్‌గా ఎంపిక చేస్తున్నాం. ఒక బాధ్యతాయుతమైన మీడియా సంస్థగా, సమాజంలో ఒక మంచి మార్పుకోసం పాటు పడుతున్న ఈస్ట్రన్‌ వంటి సంస్థ తో కలసి పనిచేయడం ఇద్దరినీ విజేతలుగా నిలిపే పరిణామం’’.

అనంతరం డిజిటల్ ఏషియానెట్ న్యూస్ మీడియా  అండ్ ఎంటర్ టైన్ మెంట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనూప్ మాట్లాడుతూ.. ప్రతి న్యూస్ మీడియా ప్రపంచంలో పాజిటివ్ స్టీరియో టైప్స్ ఏర్పాటు చేసేలా తనకు తాను ప్రమాణం చేసుకోవాలన్నారు. ఈ పింక్ సమారిటన్ పింక్ హీరోలతో గత ఆరునెలలుగా తమ ఏషియానెట్ సంస్థ యాక్టివ్ గా ఉందని, దీని గుంచి తమ డిజిటల్ సంస్థ దీనిని ప్రోత్సహిస్తూనే ఉందని వివరించారు.

                                                                                                                                                                                                                                                మీడియా కంటాక్ట్..
                                                                                                                                                                                                                                            ఇందుశేఖర్ చంద్రశేఖర్
                                                                                                                                                                                                                                         indusekhar@jupitercapital.in
                                                                                                                                                                                                                                              mob.91-7406550066

click me!