ఎక్స్ ప్రెస్ న్యూస్ : మేక కూడా స్కూలుకెళ్లింది

First Published Nov 8, 2017, 11:32 AM IST
Highlights

విశేష  వార్తలు

  • కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి హైకోర్టు అనుమతి
  • దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ విజయరాజు పై ఎసిబి దాడులు
  • మాజీ మంత్రి శ్రీధర్ బాబుకు ముందస్తు బెయిల్ మంజూరు
  • హైదరాబాద్ లో రెండు నెలల పాటు భిక్షాటనపై సిషేదం
  • కొలువుల కొట్లాట సభకు హైకోర్టు అనుమతి

టీఆర్‌టీ  అభ్యర్థుల పరేషాన్

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు తెరుచుకోని సైట్‌ 
డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చినా.. దరఖాస్తులకు సహకరించని వైనం 
గందరగోళంలో నిరుద్యోగ అభ్యర్థులు ....  
టీఆర్‌టీ నోటిఫికేషన్‌ను టీపీపీఎస్సీకి అప్పగించి షెడ్యూల్‌ను విడుదల చేసినప్పటికీ, ఆదిలోనే అవాంతరాలు మొదలయ్యాయి. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం టీఆర్‌టీ అభ్యర్థులు అక్టోబరు 30నుంచి నవంబరు 30వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. టీఆర్‌టీకి అర్హులైన ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌, పండిత్‌, పీఈటీ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి వుంది.ఇందుకోసం నెలరోజుల గడువునిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రభుత్వ నోటిఫికేషన్‌ ప్రకారం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఆరురోజులు గడిచిపోయినా, ఇప్పటివరకు ఈ సైట్‌ ఎక్కడా తెరచుకోవడం లేదు. టీఆర్‌టీ దరఖాస్తు చేసి కోచింగ్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకునేదని తలలు బాదుకుంటున్నారు. సైటే ఓపెన్‌ కాకుంటే ఎలా దరఖాస్తు చేసేదని గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గుడ్‌ గవర్నెన్స్‌లో భాగంగా త్వరలోనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లుచేస్తామని టీపీపీఎస్సీ రోజుకో ప్రకటన చేస్తున్నప్పటికీ, నిరుద్యోగ యువత మాత్రం అయోమయానికి గురవుతుంది. టీఆర్‌టీ దరఖాస్తు చేసుకునేందుకు సైట్‌ తెరుచుకోకుంటే అసలు డీఎస్సీ ఉంటుందా? లేదా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే డీఎస్సీపై రోజుకో రకమైన ప్రచారాలు కొనసాగుతుండటంతో నిరుద్యోగ యువతలో గందరగోళానికి దారితీస్తోంది. 
 

మేక కూడా స్కూలుకెళ్లింది

జంగంపల్లికి చెందిన నారాయణకు ఓ కొడుకు ఇద్దరు కూతుళ్లు. అయితే కూతుళ్లిద్దరిని బడికి పంపిస్తున్న నారాయణ కొడుకును మాత్రం బడి మాన్పించి మేకను కాయడానికి పంపించాడు. దీంతో  ఉపాద్యాయులు మహేష్ ని బడికి తీసుకురావాలనే ఉద్దేశంతో అతడి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో మహేష్ ఒక్కడే ఉన్నాడు. ఇంట్లో ఎవరూ లేరని మేకను వదిలేసి వస్తే తిడతారని టీచర్లకు మహేష్ తెలిపాడు. దీంతో అతడితో పాటు ఆ మేకను కూడా స్కూల్ కి తీసుకెళ్లారు ఉపాద్యాయులు.  

దళితుడిని చితకబాదిన నందిగామ పోలీసులు 

రంగారెడ్డి జిల్లా లో దళితుడిపై అకారణంగా పోలీసులు దాడి చేశారంటూ దళిత సంఘాలు ధర్నాకు దిగాయి నందిగామ మండలం నర్సప్పగూడ గ్రామానికి చెందిన కొంగరి రాములు   షాద్ నగర్ నుండి తన గ్రామానికి వెళ్తున్నాడు. అదే సమయంలో  గ్రామ సమీపంలోని వాగు వద్ద తనను పట్టుకున్న పోలీసులు పట్టుకొని అకారణంగా చితకబాదారని, బూటు కాలుతో తన్నారని బాధితుడు తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రజా సంఘాలు, దళిత సంఘాల నాయకులు బాధితుడికి న్యాయం చేయాలని ధర్నా కు దిగారు. అయితే ఈ విషయం తనకు తెలియదని తమ సిబ్బంది ఎవరైనా ఆ దాడికి పాల్పడితే క్షమాపణ చెప్పిస్తానని నందిగామ ఎస్సై బాధితుడికి హామీ ఇవ్వడంతో ధర్నను ఉపసంభరించుకున్నారు.
 

కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

కాళేశ్వరం  ప్రాజెక్ట్ నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన స్టే ను హైకోర్టు కొట్టివేసింది. కానీ ప్రస్తుత అనుమతుల ప్రకారం ఈ ప్రాజెక్టును త్రాగునీటి అవసరాలకు అనుగునంగా నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించింది.
గ్రీస్ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం అడవులను ధ్వసం చేయకుండా, నిర్మాణం చేపట్టాలని సూచించింది. ఈ పిటిషనర్ కు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మళ్ళీ కోర్టును సంప్రదించవచ్చని హైకోర్టు తెలిపింది.
 

ఎసిబి వలలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ విజయరాజు  
 

దేవాదాయ శాఖలో ఓ ఉన్నతాధికారి అవినీతి బాగోతాన్ని ఏసిబి అధికారులు బయటపెట్టారు. దేవాదాయ శాఖలో ఆసిస్టెంట్ కమీషనర్ పనిచేస్తున్న విజయవాడకు చెందిన విజయరాజు ఇంటిపై ఎసిబి దాడులు చేపట్టింది.  అదాయానికి మించి ఆస్తులున్నాయన్న సమాచారంతో ఏసిబీ డిఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో నిడమానూరులోని అతడి ఇంట్లో సోదాలు చేపట్టారు. తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని   సుమారు 100 కోట్లు కూడగట్టినట్లు అధికారులు సోదాల్లో బయటపడింది.   ఈ దాడుల్లో పెద్దమొత్తంలో బంగారం,వెండి, నగదు, విలాసవంతమైన కార్లను ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  
 

శ్రీధర్ బాబు కు ముందస్తు బెయిల్ మంజూరుచేసిన హైకోర్టు 
 

మాజీ మంత్రి శ్రీధర్ బాబు కు హై కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. టీఆర్ఎస్ కార్యకర్తను అక్రమంగా కేసులో ఇరికించడానికి ప్రయత్నించాడన్న అభియోగాలపై అతడిపై చిక్కడ్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఎన్డీపీఎఫ్ యాక్ట్ కింద కేసు నమోదైన విశయం తెలిసిందే.  ఈ కేసులో అరెస్ట్ ను నిలువరించాలని కోరుతూ శ్రీదర్ బాబు హైకోర్టును ఆశ్రయించగా, తాజాగా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరుచేసింది. ఈ కేసులో తనను అధికార పార్టీ రాజకీయ కక్ష్యతోనే ఇరికించిందని ఈ సందర్భంగా శ్రీధర్ బాబు తెలిపారు.  
 

కొలువుల కొట్లాట సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఎట్టకేలకు జేఏసీ కొలువుల కొట్లాట సభకు హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ సభకు ప్రభుత్వం అనుమతించకపోవడంతో జేఏసీ హైకోర్టు ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై గత కొన్ని రోజులుగా విచారణ చేపడుతున్న హై కోర్టు  ఇవాళ తుది తీర్పు వెలువరించింది. సరూర్ నగర్ స్టేడియంలో సభను నిర్వహించుకోడానికి అనుమతి ఇచ్చింది. ఈ తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేసిన జేఏసి, మూడురోజుల్లో సభ జరిగే తేదీలను ప్రకటించనున్నట్లు తెలిపింది.
 

హైదరాబాద్ లో రెండు నెలలపాటు నో బెగ్గింగ్

హైదరాబాద్ నగరంలో రెండు నెలల పాటు భిక్షాటనను నిషేధించినట్లు సిపి మహేందర్ రెడ్డి తెలిపారు. ప్రజా భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిషేదాన్ని విధించినట్లు తెలిపారు. రోడ్ల పై, జంక్షన్ ల వద్ద అడుక్కునే వారి వల్ల వాహనదారుల రక్షణకు భంగం కలుగుతోందని, అందువల్ల రెండు నెలల పాటు ప్రయోగాత్మకంగా ఈ నిషేదాజ్ఞలు జారీ చేసినట్లు మహేందర్ రెడ్డి తెలిపారు.
 

click me!