
ప్రభుత్వ టెలివిజన్ దూరదర్శన్ మారుతుంది. ఆ ఛానల్ లోగోను మార్చడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం దేశంలో 30 ఏళ్ల వయసులో ఉన్న వారు అధికంగా ఉన్నారు. వారు దూరదర్శన్ వైపు అంతగా ఆసక్తి చూపడం లేదని ప్రసారభారతి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశిశేఖర్ వెంపటి పేర్కొన్నారు. యువతను ఆకర్షించడానికి ఈ ప్రయత్నం అని తెలిపారు. డిజైన్ కోరుతూ దేశ ప్రజల నుంచి ఎంట్రీలను ఆహ్వానించారు. అందుకు కొన్ని నిబంధనలను పెట్టింది. ఎవరు లోగో డిజైన్ చేసినా... చూడగానే ఛానల్‌కు కొత్తదనం కనిపించేలా ఉండాలని పేర్కొంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకర్షించేలా సరికొత్త డిజైన్‌తో ముందుకు రావాలని నిర్ణయించినట్టు తెలిపారు.
దూరదర్శన్ లోగో చరిత్ర
దూరదర్శన్ లోగోను రూపకల్పన చేసింది దేవాశిష్ భట్టాచార్య. ఆయన విజువల్ కమ్యునికేషన్ ను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ లో చదివారు. సెప్టెంబర్ 15, 1959 ప్రసార భారతీలో ఆయన రూపొందించిన లోగో మొట్ట మొదటి సారి ప్రసారం అయింది.
లోగో మార్పు వద్దని వాదిస్తున్న బాలీవుడ్ హీరో
దూరదర్శన్ లోగోను మార్చ వద్దని బాలీవుడ్ హీరో ఆయూష్మాన్ కోరారు. ఈ లోగో ను చూస్తే నాకు నా చిన్న తనం గుర్తుకు వస్తుందని, నా లాగే దేశంలో చాలా మందికి దూరదర్శన్ లోగోతో చాలా మధుర సృతులను కల్గి ఉన్నారని, నేడు మీరు దూరదర్శన్ లోగో మార్పుతో అవన్ని చెదరిపోతాయని ఆయన అన్నారు. ఆయన ప్రభుత్వానికి ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.