ఆ ఘనత ప్రణబ్ కే దక్కింది..!

Published : Jul 26, 2017, 10:52 AM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
ఆ ఘనత ప్రణబ్ కే దక్కింది..!

సారాంశం

ప్రణబ్‌ ట్విటర్‌ ఖాతాను @POI13 పేరుతో ఆర్కైవ్‌ చేశారు @CitiznMukherjee పేరుతో ప్రణబ్‌  వ్యక్తిగత ఖాతా

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అరుదైన రికార్డ్ ని సాధించారు. మంగళవారం భారత 14వ రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా..

రాష్ట్రపతి అధికారిక ట్విటర్‌ ఖాతా 13వ రాష్ట్రపతిగా చేసిన ప్రణబ్‌ నుంచి మంగళవారం ఈ అత్యున్నత పీఠాన్ని అధిష్ఠించిన రామ్‌నాథ్‌ కోవింద్‌కు బదిలీ అయ్యింది.

ఇప్పుడు @rashtrapatibhvn ఖాతాను కోవింద్‌ నిర్వహిస్తున్నారు. దీనిని అనుసరిస్తున్నవారి(ఫాలోయర్ల) సంఖ్య ప్రస్తుతం 32.9 లక్షలుగా ఉంది.

రాష్ట్రపతిగా ప్రణబ్‌ ఉపయోగించిన ట్విటర్‌ ఖాతాను @POI13 పేరుతో ఆర్కైవ్‌ చేశారు.  ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అధికారిక ఖాతాలో పొందుపరచిన సమాచారమంతా ఇందులో నిక్షిప్తం చేశారు. ఈ ఘనత పొందిన తొలి భారత రాష్ట్రపతి ప్రణబ్ కావడం విశేషం. ఆరు నెలల క్రితం అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాకు ఇలాంటి ఘనతే దక్కింది. ఆయన అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఉపయోగించిన ట్విట్టర్ ఖాతాను కూడా @POTUS44 పేరుతో ఆర్కైవ్ చేశారు. ప్రస్తుతం @CitiznMukherjee పేరుతో ప్రణబ్‌ తాజాగా వ్యక్తిగత ఖాతాను ప్రారంభించారు. ప్రణబ్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అధికారిక ట్విట్టర్ ఖాతాకు 33.1లక్షల మంది ఫాలోవర్లుగా ఉండగా కోవింద్

అధికారంలోకి రాగానే ఫాలోవర్ల సంఖ్య 32.9లక్షలకు చేరింది.

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)