
గుండె మార్చాల్చిన పరిస్థితుల్లో గుండెకు బదులుగా ప్రస్తుతం హార్ట్ లంగ్ యంత్రాన్ని ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. హార్ట్ లంగ్ యంత్రం భారీ సైజులో ఉంటుంది. దీన్ని మనం ఇళ్లలో వాడలేము, కేవలం ఆసుపత్రుల్లో మాత్రమే ఉపయోగించడానికి వీలుంటుంది. గుండెకు కృత్రిమ గుండెను తయారు చెయ్యడానికి చాలా కాలం నుండి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కానీ అనేకునంతగా ఫలితం లేదు, కానీ జ్యూరిచ్ విశ్వ విద్యాలయ శాస్త్రవేత్తలు కొంత సమయం వరకు కృత్రిమ గుండెను కనుగొన్నారు. శాస్త్రవేత్తలు సిలికోన్ పదార్థాన్ని ఉపయోగించి త్రీడీ గుండెను తయారుచేశారు. ఇది సాధారణ గుండె మాదిరిగానే ఉంటుంది. దీనిని త్రీడి పరికారాలను ఉపయోగించి కనుగొన్నారు.
దీనిని చాలా తక్కువ సమయం మాత్రమే వాడటానికి ఉపయోగపడుతుంది. ఒత్తిడి ఎక్కువైనపుడు కవాటాల్లోన్ని ద్రవాన్ని బలంగా బయటకు పంపుతాయి. ఈ గుండె 3000 సార్లు మాత్రమే కొట్టుకోగలదు. 30 నిముషాల నుంచి 45 నిముషాల వరకే గుండెకు బదులుగా వాడుకునే అవకాశం ఉంది. జ్యూరిచ్ శాస్త్రవేత్తలు మాత్రం త్వరలోనే పూర్తి స్థాయి గుండెను కనిపెడతామని తెలిపారు.