థాంక్యూ శిరీష్... చంద్రబాబు

Published : Aug 02, 2017, 05:32 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
థాంక్యూ శిరీష్... చంద్రబాబు

సారాంశం

అల్లు శిరీష్‌ ట్వీట్ కి రిప్లై ఇచ్చిన చంద్రబాబు ప్రజలే తొలి ప్రాధాన్యం అన్న బాబు

 

 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు టాలీవుడ్‌ హీరో అల్లు శిరీష్‌కి థ్యాంక్స్ చెప్పారు. రెండు రోజుల క్రితం విజయవాడలో చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సమస్య పరిష్కారానికి పవన్‌ చొరవ తీసుకోవడం అభినందనీయమని చంద్రబాబు ట్వీట్ చేశారు.దీనికి అల్లు శిరీష్‌ స్పందిస్తూ.. ‘నాయకులు.. రాజకీయాలకు అతీతంగా ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయడం చూస్తుంటే సంతోషంగా ఉంది. మొదటి ప్రాధాన్యం దేశానికే’ అని ట్వీట్‌ చేశారు.శిరీష్‌ ట్వీట్‌కు చంద్రబాబు తాజాగా ప్రతిస్పందించారు. ‘నీ అభినందనీయమైన మాటలకు ధన్యవాదాలు అల్లు శిరీష్‌. ‘ప్రజలకు తొలి ప్రాధాన్యం’ అనేది మా సూత్రం. ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయడాన్ని కొనసాగిస్తాం’ అని ట్వీట్‌ చేశారు.

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)