గ్యాస్ గోడౌన్ లో భారీ పేలుళ్లు, భయాందోళనలో స్థానికులు (వీడియో)

Published : Sep 14, 2017, 10:37 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
గ్యాస్ గోడౌన్ లో భారీ పేలుళ్లు, భయాందోళనలో స్థానికులు (వీడియో)

సారాంశం

హెచ్పిసిఎల్ గ్యాస్ గోడౌన్ లో భారీ పేలుడు  భయాందోళనలో స్థానికులు

 

చర్లపల్లి గ్యాస్ గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హెచ్పిసిఎల్ గ్యాస్ కంపెనీకి సంభందించిన గోడౌన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగి, పెద్ద పెద్ద శబ్దాలతో సిలిండర్ లు పేలాయి.దీంతో కార్మికులంతా అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని పరుగులు తీశారు. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు చర్లపల్లి, మల్కాజిగిరి, మౌలాలి, అల్వాల్ ప్రాంతాలనుండి ఫైరింజన్లను రప్పించారు. మూడు ఫైరింజన్లు మంటలను అదువు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. 
  సిలిండర్ లు  పేలి మంటలు ఎగిరి పడుతుండటంతో స్థానిక జనం భయంతో బెంబేలెత్తి పోతున్నారు.    పోలీసులు స్థానిక  ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు. గ్యాస్ గోదాం లో ఉన్న లారీలను కూడా పోలీసులు తీప్పి పంపిస్తున్నారు. 
మూడు కిలోమీటర్ వరకు ట్రాఫిక్ ని నిలిపివేశారు పోలీస్లు.  అసలు అగ్నిప్రమాదం ఎలా చోటు చేసుకుందన్న విషయం మంటలు అదుపులోకి వస్తే గాని చెప్పలేమని పోలీసులు అంటున్నారు. ప్రస్తుతానికి మంటలను అదుపుచేయడంపైనే దృష్టి పెట్టామని అధికారులు తెలిపారు.  

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)