ఇస్లామియా కాలేజ్ లో అగ్ని ప్రమాదం (వీడియో)

First Published Sep 14, 2017, 10:51 AM IST
Highlights

 విశేష వార్తలు

  • యాకుత్ పురా లోని ఇస్లామియా కాలేజ్ లో అగ్ని ప్రమాదం
  • ఏలూరు సమీపంతో ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురి మృతి 
  • అగ్రిగోల్డ్  ఆస్తులపై హైకోర్టు లో కొనసాగుతున్న విచారణ
  • కోదాడ వద్ద అదుపుతప్పి బోల్తాపడిన ఆర్టీసి బస్సు
  • జోగులాంబ జిల్లాలోని ఆర్డీఎస్ కాలువలో పడి బాలుడి గల్లంతు

 ప్రభుత్వానికి వ్యతిరేకంగా అచ్చంపేట లో టీడీపీ ధర్నా (వీడియో) 
 

మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట లో టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాకు దిగారు.  రైతు సమన్వయ సమితిలఏర్పాటును వ్యతిరేకిస్తూ  జీవో 39 ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సంధర్బంగా  టిడిపి అచ్చంపేట నియోజకవర్గం ఇంచార్జ్ చారకొండ వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ ఈ ధర్నా చేపట్టినట్లు తెలిపాడు.

ఇస్లామియా కాలేజ్ లో అగ్ని ప్రమాదం (వీడియో)

పాతబస్తీలోని యాకత్ పురా ప్రాంతంలోని ఇస్లామియా కాలేజ్ లో అగ్నిప్రమాదం సంభవించింది. కళాశాల లోని 3 వ అంతస్తులో దట్టమైన పొగలతో కూడిన మంటలు వ్యాపించాయి. సమాచారం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. 

మూసి నదిలో చిక్కుకున్న శివభక్తులు

యాదాద్రి భువనగిరి జిల్లాలో పరవళ్లు తొక్కుతున్న మూసీ నదిలో 10 మంది  శివభక్తులు చిక్కుకున్నారు. వివరాల్లోకి వెళితే వలిగొండ మండలం భీమలింగం గ్రామంలో మూసీనది ఒడ్డున వున్న శివలింగాన్ని దర్శించుకోడానికి 10  భక్తుల బృందం  వెళ్లింది. వారు వెళ్లిన సమయంలో ఒక్కసారిగా మూసీలో వరద నీరు పెరిగి వారిని చుట్టుముట్టింది. దీంతో భక్తులంతా గుడి పైకి ఎక్కి రక్షించాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని కాపాడటానికి ప్రయత్నిస్తున్నారు.దీనికోసం ఉన్నతాధికారులతో మాట్లాడి హెలికాఫ్టర్ ని తెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నారు.                        
 అలాగే వీరిని రక్షించేందుకు  ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఎన్డిఆర్ఎఫ్ బృందం మరికాసేపట్లో ఘటనా స్థలానికి చేరుకోనుంది.
 

డాక్టర్ల నిర్లక్ష్యం, చిన్నారులకు అస్వస్థత

తిరుపతి రుయా హాస్పిటల్లో డాక్టర్ల నిర్లక్ష్యం చికిత్స కోసం వచ్చిన చిన్నారులను మరింత అస్వస్థకు గురయ్యేలా చేసింది. డాక్టర్లు ఇచ్చిన యాంటిబయాటిక్ ఇంజక్షన్ వికటించి 11 మంది చిన్నారులు అనారోగ్యానికి గురయ్యారు. వీరికి ఇంజక్షన్  చేసిన వెంటనే జ్వరం రావడంతో పాటు తీవ్ర వాంతులు, విరేచనాలు   చేసుకున్నారు.దీంతో అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది ఈ చిన్నారులను ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు.ఈ ఘటన పట్ల చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.   

ఆర్టీసి డ్రైవర్ పై హత్యా యత్నం

అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. ఆర్టీసీ లో కాంట్రాక్ట్ డ్రైవర్  గా పనిచేస్తున్న వెంకటరమణ అనే వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. అయితే ఈ హత్యాయత్నంలో వెంకటరమణ ప్రాణాలతో బయటపడినప్పటికి కత్తి మాత్రం మెడలో ఇరుక్కుపోయింది. వెంటనే అతడిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 

కారు  ప్రమాదంలో ఆరుగురి మరణం

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు సమీపంతో ఘోర ప్రమాదం సంభవించింది. ప్రయాణికులను తీసుకువెలుతున్న స్కార్పియో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే వున్న కాలువలో పడింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రయాణికులు మృత్యువాత పడ్డారు.మృతులంతా బాపులపాడు మండలానికి చెందిన మల్లపల్లి వాసులుగా గుర్తించారు. చనిపోయిన వారందరూ మహిళలే కావడం, అందులో ఓ రెండేళ్ల చిన్నారి వుండటం అత్యంత భాధాకర విషయం.

మరో ఇద్దరు డ్రగ్స్ సరఫరాదారుల అరెస్టు

ప్రభుత్వం, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా హైదరాబాద్ లో మాదకద్రవ్యాల ముఠాలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. తాజాగా మియాపూర్ లోని మహబూబ్ పేటలో నివాసముంటున్న  రాజస్థాన్ కు చెందిన ఇద్దరు డ్రగ్స్ సరపరాదారులను ఎస్వోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కిలో ఓపియం డ్రగ్ తో పాటు 26 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అగ్రిగోల్డ్ ఆస్తులు కావాలంటే 10 కోట్లు డిపాజిట్ చేయాల్సిందే 

అగ్రిగోల్డ్ కేసు పై హైకోర్టు లో విచారణ కొనసాగుతోంది. అగ్రిగోల్డ్ ఆస్తుల కొనుగోలు కు ముందుకువచ్చిన జీఎస్సెల్ సంస్థకు కోర్టు కొన్ని షరతులు విధించింది.  తమ వద్ద 10 కోట్లు డిపాజిట్ చేస్తే  ఆస్తులకు సంభందించిన వివరాలు, అగ్రిగోల్డ్ డిపాజిట్ల వివరాలు తెలియజేస్తామని తెలిపింది.అయితే దీనిపై జీఎస్సెల్ సంస్థ స్పందనను మద్యాహ్నం వరకు తెలియజేయాలని దర్మాసనం ఆదేశించింది.
 

కాలువలో పడి బాలుడి గల్లంతు

జోగుళాంబ గద్వాల జిల్లా ఐజ మండలంలోని మేడికొండ గ్రామంలో ప్రమాదవశాత్తు ఓ బాలుడు  కాలువలో పడి గళ్లంతయ్యాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పొంగిపొర్లుతున్న ఆర్డీఎస్ కాలువలో నీటిని చూడటానికి  వెళ్లిన అభి అనే 9 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు కాలువలో పడి కొట్టుకుపోయాడు. గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికి బాబు ఆచూకీ లభ్యం కాకపోవడంతో    తల్లిదండ్రులు భయాందోళనకు లోనవుతున్నారు.                       

సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం

సూర్యాపేట జిల్లా కోదాడ లోని గుడిబండా ఫ్లైవర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి ఏలూరికి  వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే   ప్రమాదంతో ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలవగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి  తరలించి చికిత్స అందిస్తున్నారు.
 

click me!