హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం, మెడిసిన్ విద్యార్థిని మృతి

Published : Nov 11, 2017, 10:28 AM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం, మెడిసిన్ విద్యార్థిని మృతి

సారాంశం

విశేష వార్తలు  రోడ్డు ప్రమాదంలో యువతి మృతి పెళ్లి షాపింగ్ కు హైదరాబాద్ కు వచ్చిన యువతి

హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం, మెడిసిన్ విద్యార్థిని మృతి

 హైదరాబాద్ : సరూర్ నగర్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో పది రోజుల్లో వివాహం కావాల్సిన ఓ యువతి మృతిచెందింది. వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లాకు చెందిన గీతకు ఆయుర్వేదంలో మెడిసిన్ చదువుతోంది. ఆమెకు ఇటీవలే పెళ్లి కుదిరింది. పెళ్లి బట్టలు తీసుకోడానికి కుటుంబసభ్యులంతా కలిసి  హైదరాబాద్ కు వచ్చారు. షాపింగ్ ముగించుకుని కుటుంబసభ్యులంతా కారులో వెలుతుండగా గీత మాత్రం కాబోయే భర్తతో కలిసి బైక్ పై బయలుదేరింది. ఈ క్రమంలో సరూర్ నగర్ వద్ద బైక్ యూ టర్న్ తీసుకుంటుండగా వెనుకనుంచి వచ్చి టిప్పర్ లారీ డీ కొట్టింది. దీంతో గీత రోడ్డుపై పడిపోగా ఆమె తలపై నుంచి టిప్పర్ లారీ వెళ్ళడంతో తల చిద్రమై అక్కడికక్కడే మృతి చెందింది.  
పది రోజుల్లో పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన కూతురు ఇలా ప్రమాదంలో చనిపోవడంతో తల్లిదండ్రులు  శోకసంద్రంలో మునిగిపోయారు.  ప్రమాదం పై కుటుంబసబ్యులు సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు మృతదేహం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.  

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)