ఎక్స్ ప్రెస్ న్యూస్ : ప్రతిపక్షాలు 10 రోజులంటే ప్రభుత్వం 50 రోజులు

First Published Oct 26, 2017, 10:35 AM IST
Highlights

విశేష వార్తలు

  • ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ తలసాని
  • బేగంపేటలో మహిళ హల్  చల్
  • క్యాడ్ బెరీ సంస్థకు జరిమానా విధించిన వినియోగదారుల ఫోరం
  • హార్దిక్ పటేల్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
  • ఎన్టీఆర్ ఘాట్ వద్ద మౌన దీక్షకు దిగిన లక్ష్మీ పార్వతి

రోడ్డు ప్రమాదంలో సింగిల్ విండో ఛైర్మెన్ కృష్ణయ్య యాదవ్ మృతి (వీడియో)

రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో షాద్ నగర్-ఫరూఖ్ నగర్ సింగిల్ విండో ఛైర్మన్,తెలుగుదేశం పార్టీ నేత కృష్ణా యాదవ్ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు అతని అనుచరులకు తీవ్రగాయాలపాలయ్యారు.షాద్ నగర్   శివారులోని సోలిపూర్ వద్ద గల పాత జాతీయ రహదారి పై చెట్టుకు కారు డి కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారికి చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఉస్మానియాకు తరలించారు.  
 

రోడ్డు ప్రమాదానికి గురైన కరీంనగర్ జడ్పీ చైర్ పర్సన్  

సిద్ధిపేట జిల్లా: కుకునూర్ పల్లి వద్ద కరీంనగర్ జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ ప్రమాదానికి గురయ్యారు. ఆమె ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం రోడ్డు ప్రమాదానికి గురవడంతో స్వల్ప  గాయాలపాలయ్యారు. ఆమెతో పాటు ఆమె భర్త కూడా ఈ ప్రమాదంలో గాయనడ్డాడు. హైదరాబాద్ లో జరిగే పార్టీ మీటింగ్ కు  హాజరవడానికి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.  ఎవరికీ పెద్దగా గాయాలు కాకపోవడంతో  ఉమా దంపతులు వేరే కారులో హైదరాబాద్ వెళ్లిపోయారు.
 

ప్రతిపక్షాలు 10 రోజులంటే ప్రభుత్వం 50 రోజులు

తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి చిత్తశుధ్దితో పనిచేస్తోందని, వారు 10 రోజులు నిర్వహద్దామంటే మేము 50 రోజులు నిర్వహించడానికి సిద్దమని మంత్రి తలసాని స్సష్టం చేశారు. సవావేశాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా జరుపుతామని స్నేహపూర్వకంగా చెప్పినప్పటికి కాంగ్రెస్ పార్టీ కయ్యానికే మొగ్గచూపుతోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు అసెంబ్లీలో ఏం మాట్లాడాలో తెలీక, చలో అసెంబ్లీ అనే కార్యక్రమానికి పిలుపునిచ్చిందని ఎద్దేవా చేశారు.ప్రతిపక్షాలకు ఏం మాట్లాడినా వినాలని సీఎం ఆదేశించారని, ఇంతకంటే మంచి అవకాశం వారికి ఇంకెవరిస్తారని మంత్రి ప్రశ్నించారు. కాబట్టి  సీఎల్పీ నేత జానారెడ్డి బాధ్యతతో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ఉపసంహరించుకోవాలి, లేదంటే వారి పరువే పోతుందని తలసాని హితవు పలికారు.
 

బేగంపేటలో ఈ మహిళ ఎలా రెచ్చిపోయిందో చూడండి (వీడియో)
 

హైదరాబాద్ లోని బేగంపేట వద్ద ఓ మహిళ హల్ చల్ చేసింది. కారులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఇతర వాహనాలను గుద్దుకుంటూ, వాహనదారులను భయాందోళనలకు గురిచేసింది. అంతే కాకుండా ఓ వాహనదారుడిని దుర్భాషలాడుతూ, దాడికి పాల్పడింది. దీన్ని అడ్డుకున్న ట్రాఫిక్ సిబ్బంది, మహిళను సముదాయించి అక్కడి నుంచి వెళ్లగొట్టారు.ఆ మహిళ చేస్తున్న హంగామాను కొందరు వాహనదారులు వీడియో తీశారు. ఆ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
  

క్యాడ్ బెరీ సంస్థకు జరిమానా

ప్రముఖ చాకోలేట్ల కంపెనీ క్యాడ్ బెరీ సంస్థకు వినియోగదారుల ఫోరం 50,000 జరిమానాను విధించింది. వారి సంస్థకు చెందిన చాకోలేట్ లో బ్యాక్టీరియా వంటి క్రిములు వచ్చాయన్న ఫిర్యాదుపై విచారించిన ఫోరం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. వివరాల్లోకి వెళితే గుంటూరుకు చెందిన అనుపమ అనే మహిళ కొన్ని రోజుల క్రితం క్యాడ్ బెరీ డెయిరీ మిల్క్ చాకోలేట్ కొంది. అయితే అందులో అనారోగ్యకరమైన బాక్టీరియాను గుర్తించింది. వినియోగదారులకు నాణ్యత లేని సరుకులు అందిస్తుందని క్యాడ్ బెరీ సంస్థపై, దాని అనుభంద సంస్థపై వినియోగదారుల ఫోరంకు ఫిర్యాదు చేయడంతో వారు జరిమానా విధించారు. 

హార్ధిక్ పటేల్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి కన్వీనర్ హార్దిక్ పటేల్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. గుజరాత్ లో రిజర్వేషన్ల కోసం చేపట్టిన ఆందోళనలో బాజపా ఎమ్మెల్యే రుషికేశ్ పాటిల్ కార్యాలయం పై దాడిచేసిన ఘటనలో హార్ధిక్ నిందితుడు. అయితే ఈ కేసుల్లో హాజరు కావాల్సిందిగా కోర్టు ఆదేశించినప్పటికి అతడు హాజరుకాలేదు. దీంతో అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.  
 
 

ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీ పార్వతి మౌన దీక్ష (వీడియో)

తన జీవిత చరిత్రపై ''లక్ష్మీ వీర గ్రంధం'' సినిమా తీయడం చట్ట విరుద్దమని పేర్కొంటూ ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీ పార్వతి మౌన దీక్ష చేపట్టారు. తన అనుమతి లేకుండా సినిమా తీస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈ సినిమా యూనిట్ ను హెచ్చరించారు. ఈ సినిమా అనుమతి కోసం తనను ఎవరూ సంప్రదించలేదని, సంప్రదించాలని వచ్చినా తాను వారిని కలవడానికి సిద్దంగా లేనని ఆమె స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు నన్నుఎంతగానో  బాధించాయని, ఎవరు ఎంత ఇబ్బంది పెట్టిన సత్యం  కోసం పోరాటం ఆగదన్నారు. ఇబ్బందుల నుండి ఉపశమనం పొదేందుకే ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చానని లక్ష్మీ పార్వతి తెలిపారు. 
 

తెలంగాణ అసెంబ్లీ పరిసరాల్లో నిషేదాజ్ఞలు

అక్టోబర్ 27 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో నిషేదాజ్ఞలు విధిస్తున్నట్లు సిపి మహేందర్ రెడ్డి తెలిపారు.  శాంతిభద్యలను దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ పరిసర ప్రాంతాలలో నాలుగు కిలో మీటర్ల వరకు నిషేదాజ్ఞనలు అమల్లో ఉండనున్నాయి. ఈ నిషేదిత ప్రాంతాల్లో సభలు, సమావేశాలు,ధర్నాలు నిర్వహించరాదు. అలాగే అసెంబ్లీ సమావేశాలు ప్రశాంతంగా జరగటానికి 3000 ల పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహించనున్నారు.దీని కోసం వివిధ జిల్లాల   పోలీసులను కూడా వినియోగించనున్నారు. అనుమతి ఉన్నవారికి మాత్రమే అసెంబ్లీ లోని అనుమతి స్తామని సిపి తెలిపారు.
 

click me!