ఎక్స్ ప్రెస్ న్యూస్ : ''అఖిలపక్షం కాదది, దొంగల గుంపు''

First Published Oct 25, 2017, 10:33 AM IST
Highlights

విశేష వార్తలు

  • అఖిలపక్షనాయకులపై విరుచుకు పడ్డ జగదీశ్ రెడ్డి
  • సిద్దిపైటలో భర్త ఇంటిముందు ధర్నాకు దిగిర బార్య
  • గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
  • ఉపరాష్ట్రపతి రాక సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
  • విషాదాంతమైన నీలోపర్ కిడ్నాప్ ఘటన
  • రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య

మరుగుదొడ్లు నిర్మించుకోని ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేత

ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురంలో మరుగుదొడ్ల లేని 32 ఇళ్లకు అధికారులు కరెంట్ సరఫరా నిలిపివేశారు. అంతే కాకుండా ఆ ఇళ్లలో నివాసముండే వారికి ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సదుపాయాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.స్వచ్చ భారత్ లో బాగంగా మరుగుదొడ్లు నిర్మించుకోవాలని చెప్పినా వినకపోవడంతో ఇంత కఠినంగా వ్యవహరించామని,వారు మరుగుదొడ్లు నిర్మంచుకున్నాకే ఈ సదుపాయాలన్నీ పునరుద్దరిస్తామని అధికారులు తెలిపారు.    
 

వరంగల్ లో అంతర్రాష్ట్ర దొంగలముఠా అరెస్ట్

వరంగల్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో తాళం వేసివున్న ఇండ్లల్లో చోరీలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు.  వారి నుంచి సుమారు   551 గ్రాముల బంగారు, 625 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీరికి సంభందించిన వివరాలను వరంగల్ పోలీస్ కమీషనర్ సుధీర్ బాబు మీడియా ప్రతినిధులకు వెల్లడించారు.

విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి జూపల్లి

వనపర్తి లోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాల లో పది రోజుల క్రితం ఆత్మ హత్య చేసుకున్న విద్యార్థిని శివ శాంతి కుటుంబాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు. అయితే తమ కూతురి ఆత్మహత్య పై  పలు అనుమానాలున్నాయని మృతురాలి తల్లిదండ్రులు మంత్రికి తెలిపారు. దీంతో మంత్రి అక్కడే ఉన్న జిల్లా ఎస్పీకి స్వయంగా ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ కేసు పై పర్యవేక్షణ చెయ్యాలని ఆదేశించారు.

గుండెపోటుతో బస్సులోనే ప్రయాణికురాలి మృతి

కరీంనగర్ జిల్లా : మంచిర్యాలకు చెందిన ఓ మహిళ ఆర్టీసి బస్సులో ప్రయాణిస్తుండగా గుండె పోటుతో మృతి చెందింది. మంచిర్యాల నస్పూర్‌కు చెందిన రహెనా సుల్తానా(60)  రామగుండంలోని తన కూతురు సనా సుల్తానా వద్దకు వెళ్లడానికి బయల్దేరింది. ఈ క్రమంలో గోదావరిఖని నుండి రామగుండం కు వెళ్లే బస్సెక్కి వెళుతుండగా  హఠాత్తుగా గుండెపోటు రావడంతో కుప్ప కూలిపోయింది. గుండె పోటు తీవ్రంగా రావడంతో సుల్తానా అక్కడికక్కడే మృతి చెందింది.
 

''అఖిలపక్షం కాదది, దొంగల గుంపు''

సూర్యాపేట జిల్లాలో అఖిలపక్షం పేరుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని పార్టీలు జతకట్టాయని, అయితే అది అఖిలపక్షం కాదని దొంగల గుంపని  మంత్రి జగదీశ్ రెడ్డి  అభివర్ణించారు. గతంలో ఆదిపత్యం కోసం, రాజకీయ అవసరాల కోసం గ్రామాల్లో హత్యా రాజకీయాలకు పాల్పడ్డ దొంగలు ఇప్పుడు కలసి తిరుగుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అలాగే ఒకప్పుడు తుంగతుర్తి నియోజకవర్గాన్ని నాశనంచేసిన వారే మళ్లీ ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్ట్ ను అపడానికి కేసుల వేస్తున్నాయని అన్నారు. ఇంత కాలం అధికారంలో ఉన్న నేతలు కమిషన్ లకు కక్కుర్తి పడడం వల్లనే యస్.ఆర్.యస్.పి రెండవ దశ ఇప్పటికి పూర్తి కాలేదన్నారు.అఖిలపక్షం పేరుతో వారు చేస్తున్న రాజకీయాలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని మంత్రి విమర్శించారు.

భర్త ఇంటిముందు ధర్నాకు దిగిన బార్య (వీడియో)

తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటిముందు భార్య నిరసన చేపట్టిన సంఘటన సిద్దిపేట పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే సిద్దిపేట లోని భరత్ నగర్ కు చెందిన బండి రాజు మాదురిలు బార్యాభర్తలు. అయితే మాధురి ఇటీవల ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి రాజు ప్రవర్తనలో మార్పు వచ్చి, మాధురికి కష్టాలు మొదలయ్యాయి. ఆడపిల్లలు పుట్టారని అదనపు కట్నం కావాలని భర్త వేధింపులు మొదలుపెట్టాడు.    దీంతో విసుగుచెందిన మాధురి ఈ రోజు తన ఇద్దరు చిన్నారులను తీసుకొని న్యాయం చేయాలంటూ భర్త ఇంటిముందు ఆందోళనకు దిగింది.  

మహిళలకు షాకిచ్చిన సంగారెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే (వీడియో)

నియోజకవర్గ సమస్యల గురించి ప్రశ్నించిన మహిళలకు సంగారెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఏ విధంగా సమాదానం చెపుతున్నారో చూడండి. జనావాసాల మద్య వున్న ఓ వైన్ షాప్ వల్ల సమస్యగా ఉందని దానిపై చర్యలు తీసుకోవాలని మహిళలు ఆయన్ని కోరారు. అయితే వైన్ షాప్  విషయంలో తానేమీ చేయలేనని చెబుతూనే మహిళల పై విధంగా కామెంట్ చేశారు.    

గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
 

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం  షెడ్యూల్ ను విడుదల చేసింది. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 9 మరియు 14 తేదీల్లో ఎన్నికలు నిర్వహించి 18 వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నట్లు ఎలక్షన్ కమీషన్ తెలిపింది. ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 50 వేల పైచిలుకు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఎన్నికల్లోను వీవీ పాట్ యంత్రాలను ఉపయోగించనునన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి  అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా హైదరాబాద్ లో  ట్రాఫిక్‌ ఆంక్షలు 

 ఉపరాష్ట్రపతి  వెంకయ్యనాయుడు ఇవాళ హైదరాబాద్ కు వస్తున్న నేపధ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సిపి మహేందర్ రెడ్డి తెలిపారు. ఆయన పర్యటించనున్న ఈ మూడు రోజులు పలు చోట్ల ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటామని సిపి తెలిపారు. ఇవాళ ఉదయం బేగంపేట ఎయిర్‌పోర్టు, పీఎన్‌టీ జంక్షన్‌, శ్యామ్‌లాల్‌ బిల్డింగ్‌, హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌, బేగంపేట్‌ ఫ్లైఓవర్‌, గ్రీన్‌ల్యాండ్స్‌ జంక్షన్‌ వరకు ట్రాఫిక్‌ అంక్షలు అమల్లో ఉంటాయి. మధ్యాహ్నం 2.25 నుంచి 3.15 వరకు, తిరిగి 3.45 నుంచి 4.30 వరకు హరిత ప్లాజా మెయిన్‌ రోడ్‌, గ్రీన్‌ల్యాండ్స్‌ యూ టర్న్‌, సీఎం క్యాంప్‌ ఆఫీస్‌, పంజాగుట్ట ఫ్లైఓవర్‌, శ్రీనగర్‌ టి జంక్షన్‌, కేబీఆర్‌ పార్కు, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, పెద్దమ్మ టెంపుల్‌, క్రోమా బిల్డింగ్‌, మాదాపుర్‌ ఆర్క్‌ వరకు అంక్షలు ఉంటాయి.
అక్టోబర్‌ 26న ఉదయం 7.30 నుంచి 8.45 వరకు తిరిగి సాయంత్ర 4.15 నుంచి 5.30 వరకు బంజారాహిల్స్‌ (రోడ్‌ నెంబరు-12), ఏసీబీ ఆఫీస్‌, సీఆర్‌పీఎఫ్‌ క్యాంప్‌ ఆఫీస్‌, మాసాబ్‌ ట్యాంక్‌ రోడ్డు, పీవీనరసింహారావు ఎక్స్‌ప్రెస్‌ వే ద్వారా శంషాబాద్‌ వరకు ట్రాఫిక్‌ అంక్షలుంటాయి.
అక్టోబర్‌ 27న ఉదయం 8.45 నుంచి 9.25 వరకు బంజారాహిల్స్‌  లోని ఒరిస్సా ఐలాండ్‌, క్యాన్సర్‌ హాస్పిటల్‌, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌, శ్రీనగర్‌ టి జంక్షన్‌, పంజాగుట్ట ఫ్టై ఓవర్‌, సీఎం క్యాంప్‌ ఆఫీస్‌, బేగంపేట్‌ ఫ్లైఓవర్‌, బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌ వరకు ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయి.

విషాదంతో ముగిసిన నీలోఫర్ కిడ్నాప్ ఘటన 

నీలోఫర్ లో కిడ్నాప్ కు గురైన పసికందు కిడ్నాప్ ఫటన విషాదంతో ముగిసింది. చిన్నారిని అపహరించిన మంజుల నాగర్ కర్నూల్ జిల్లాలోని బండోనిపల్లి కి తీసుకుపోయింది. అప్పటికే పసికందు అనారోగ్యంతో ఉండటం, కిడ్నాపర్ ఎలాంటి వైద్యం చేయించకపోవడంతో సాయంత్రమే మృతి చెందింది. దీంతో అదే గ్రామ శివారులో మృతదేహాన్ని పూడ్చిపెట్టింది.
అయితే పసికందు మృతి చెందినట్లు తెలిసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తునన్నారు.  నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
 

ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం,మాజీ ఎమ్మెల్యేకు గాయాలు

ఖమ్మం జిల్లా మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న ఆర్టీసి బస్సు అదుపుతప్పి ప్రమాదం జరగడంతో ఎమ్మెల్యేకు స్వల్పంగా గాయాలయ్యాయి.  హైదరాబాద్ నుండి ఖమ్మం కు  వెళుతుండగా కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద  ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో వున్న ఎమ్మెల్యేతో పాటు మరో 15 మంది ప్రయాణికులకు కూడా గాయాలయ్యాయి. గాయపడ్డవారిని స్థానికులు దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు.  ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు.

విజయవాడలో రోడ్డు ప్రమాదం,ఓ చిన్నారి మృతి (వీడియో)

కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం వద్దగల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తమ కూతురిని స్కూల్లో వదిలిపెట్టడానికి వెళుతున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది.  స్థానికి చైతన్య పాఠశాల లో 1వ తరగతి చదువుతున్న విశిష్ఠ అనే చిన్నారితో పాటు తల్లిదండ్రులు బైక్ పై స్కూలుకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆగి ఉన్న లారిని డి కోట్టారు. దీంతో చిన్నారి వశిష్ఠ అక్కడికక్కడే మృతి చెందగా, తల్లిదండ్రులు కు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న వారిని ఆస్పత్రికి తరలించారు.
 

click me!