
గుంటూరు జిల్లా తెనాలిలో ఓ వైద్య విద్యార్థిని ఆత్మహత్య కలకలం సృష్టించింది. స్థానిక రాజీవ్ గృహకల్ప లో ఉన్న వాటర్ ట్యాంక్ పై నుండి దూకి అనిలా లీజర్ అనే వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గుంటూరు మెడికల్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న మృతురాలు ఈ మధ్య తరచూ తెనాలిలో రాజీవ్ గృహ కల్ప వద్ద కు వచ్చి వెళుతునట్లు స్థానికులు తెలిపారు. అదే విధంగా ఈ రోజు కూడా అక్కడకు వెళ్లిన అనీలా వాటర్ ట్యాంక్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
ఈ నెల 27 నుండి తెలంగాణ అసెంబ్లి సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లి మీడియా సలహ కమిటి సమావేశం కమిటి హల్లో జరిగింది. సమావేశాల్లో మీడియా పరంగా తీసుకోవాల్సిన చర్యలపై అసెంబ్లి సెక్రటరీ నర్సింహాచార్యులుతో మీడియా సలహా కమిటి చైర్మణ్ సూరజ్ భరద్వాజ్ తోపాటు ఇతర కమిటి సభ్యులు చర్చించారు. ఇందులో భాగంగానే టెంపరరీ పాసుల కోసం ఇద్దరు మీడియా కమిటి సభ్యుల సంతకాలతో కూడిన లెటర్ తో తాత్కాలిక పాసులను ఇవ్వాలని నిర్ణయించారు.అలాగే పబ్లిక్ గార్డెన్ గేట్ ముందు ట్రాఫిక్ సిగ్నల్ ను ఏర్పాటు చేయడం తోపాటు అవసరమైతే ట్రాఫిక్ సిగ్నల్ ఐలాండ్ ను ఏర్పాటు చేయించనున్నట్టు సెక్రటరీ తెలిపారు. ఇక కెమెరా మెన్లకు ,ఫోటో గ్రాఫర్లకు ప్రత్యేకంగా బోజన సౌకర్యం ఏర్పాటు పై కమిటి సభ్యులు కోరడంతో సెక్రటరీ సానూకులంగా స్పందించారు. స్పికర్ తో చర్చించిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు అసెంబ్లీ సెక్రటరీ తెలిపారు.
తెలంగాణ ఉద్యమ నినాదమైన నీళ్లు నిధులు నియామకాలలో తెలంగాణ ప్రభుత్వం విస్మరించిన నియామకాలను వేగవంతం చేయాలని కోరుతూ జేఏసి తలపెట్టిన కార్యక్రమమే కొలువులకై కొట్లాట. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో జనాలను కూడగట్టాలని బావించిన ఇబ్రహింపట్నం జేఏసి నాయకులు వాల్ పోస్టర్ లను తయారుచేయించారు. వాటిని ఇవాళ జెఎసితో పాటు సిపిఐ, టిడిపి, బిజెపి నాయకులంతా కలిసి విడుదల చేశారు.
హెడ్డింగ్ చూసి శ్రీముఖి ని యాంకరింగ్ లో ఎవరో పోటీకి వస్తున్నారని అనుకుంటున్నారా ? అయితే మీరు పొరపడ్డట్టే. టివి యాంకర్ల మద్య పోటీ ఒక్క యాంకరింగ్ లోనే కాదండి ఇపుడు అన్ని విషయాల్లోను కొనసాగుతోంది. ఓ టీవీ షోలో జరిగే డ్యాన్స్ ప్రోగ్రాం లో ప్రముఖ యాంకర్ శ్రీముఖి మరో యాంకర్ త్రిపుర నిమ్మగడ్డ కలిసి డ్యాన్స్ చేయనున్నారు. అయితే ఈ డ్యాన్స్ షో కోసం తెగ సాధన చేస్తున్న త్రిపుర డ్యాన్స్ లో శ్రీముఖిని మించిపోయేలా అదరగొట్టి ప్రేక్షకులను అలరిస్తానని సవాల్ విసురుతోంది. అందుకోసం ఆమె ఎంతలా కష్టపడుతుందో మనం కూడా చూద్దామా...
చైతన్య పురి పోలీసు స్టేషన్ పరిధిలో గల బిసి బాలికల గురుకుల పాఠశాల సిబ్బంది ఓ విద్యార్థినిపై దారుణంగా వ్యవహరించారు. ఆరవ తరగతి చదువుతున్న అంజలి అనే పది సంవత్సరాల విద్యార్థిని అల్లరి చేసిందనే నెపంతో 50 గుంజీలు తీయించడంతో పాటు గంటసేపు మోకాళ్ల పై ఎండలో నిలబెట్టారు. దీంతో బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించి, దీనికి కారకుడైన పాఠశాల ప్రిన్సిపాల్ పై చర్యలు చేపట్టాలని కోరాడు. దీంతో బాలల హక్కుల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా ప్రిన్సిపాల్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని విద్యాశాఖను డిమాండ్ చేసింది.
తెలంగాణ జేఏసీ తలపెట్టిన కొలువుల కొట్లాట సభ కు అనుమతిని హైకోర్టు నిరాకరించింది. అనుమతికి సంబందించి జేఏసి దాఖలుచేసిన పిటిషన్ ను కొట్టివేసింది. నిర్వాహకులు సభకు అనుమతి పోలీసులను కొరినట్లయితే వారు అనుమతి ఇవ్వని ఎడల మళ్ళీ కోర్ట్ కు రావొచ్చన్న హైకోర్టు సూచించింది. అలాగే ఈ పిటిషన్ ను దాఖలు చేయడానికి పిటిషనర్ కు గల అర్హత ను కూడా న్యాయమార్తి ప్రశ్నించారు. మొత్తానికి పోలీసులు నుంచి అనుమతి తీసుకోవాలని, వారు అనుమతించని పక్షంలో తాము ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది.
గద్వాల్ కలెక్టర్ రంజిత్ కుమార్ ,ఎస్పీ విజయ్ కుమార్,మహబూబ్ నగర్ కలెక్టర్ రోనాల్డ్ రోస్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ లకు హై కోర్టు నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే మహబూబ్ నగర్ మున్సిపాలిటీ లో 100 కోట్లు,గద్వాల్ మున్సిపాలిటీ లో 81 లక్షలు అవినీతి జరిగిందంటూ హైకోర్టు లో న్యాయవాది ప్రవీణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ అవినీతిపై గద్వాల్ పోలీస్ స్టేషన్లో ప్రభుత్వ ఓ ప్రభుత్వోద్యోగి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ పమోదైనప్పటికి కూడా అయిన ఇంతవరకు చర్యలు తీసుకోలేదని కోర్టుకు విన్నవించాడు పిటిషనర్.
ఈ పిటిషన్ విచారణ సంధర్భంగా హైకోర్టు స్పందిస్తూ ఈ కేసులో జాప్యంపై ఎసిబి మందలించింది. అలాగే ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని మహబూబ్ నగర్ మున్సిపాలిటీ కమిషనర్ దేవ్ సింగ్ ను హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణను నవంబర్ 14 కు హైకోర్టు వాయిదా వేసింది.
హైదరాబాద్ నగరంలోని పాఠశాలలు,రెసిడెన్సియల్ సంఘాలు, హోటళ్లు, మార్కెట్ కమిటీలు, ఆస్పత్రుల్లో స్వచ్చతను పెంపొదించాలని జీహెచ్ఎంసీ ఆలోచిస్తోంది. అందుకోసం వివిధ కేటగిరీల్లో ఈ సంస్థలకు స్వచ్చత అవార్డులను ఇవ్వనున్నట్లు, అందుకోసం ఈ నెల 25 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కమీషనర్ జనార్ధన్ రెడ్డి తెలిపారు. ఈ దరఖాస్తులు సంభందిత డిప్యూటి కమీషనర్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయని కమీషనర్ వివరించారు. స్వచ్ఛ అవార్డులకు దరఖాస్తులు దాఖలు చేసేందుకు వివరాలను జీహెచ్ఎంసి వెబ్ సైట్ లో చూడవచ్చని లేదా సంబంధిత డిప్యూటీ కమీషనర్లు, మెడికల్ ఆఫీసర్లను సంప్రదించాలని కమీషనర్ వివరించారు. వచ్చిన దరఖాస్తులను హెడ్డాఫీసుకు 26 వ తేదీన డిప్యూటీ కమిషనర్లు సమర్పిస్తారని, వాటిని పరిశీలించిన పిదప అవార్డులను ప్రకటిస్తామని జనార్ధన్ రెడ్డి తెలిపారు.
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ హిజ్ బుల్ ముజాహిధ్దిన్ కు చెందిన ఉగ్రవాది షాహిద్ యూసుప్ ను ఎన్ఐఏ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడు ఉగ్రవాద సంస్థలకు నిధులు సరపరా చేస్తున్నడనే అభియోగం ఉంది. అంతేకాకుండా ఇతడు హిజ్ బుల్ ముజాహిధ్దిన్ ఉగ్రవాద సంస్థ చీఫ్ సలావుద్దిన్ కొడుకు. దీంతో యూసుప్ పై గత కొంత కాలంగా నిఘా ఉంచిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ ఇవాళ జమ్మూ కాశ్మీర్ లో అదుపులోకి తీసుకుంది.
హైదరాబాద్ కాప్రా సర్కిల్ చర్లపల్లి పారిశ్రామిక వాడలోని మెగా ఉచిత వైద్యశిబిరం మరియు రక్తదాన శిబిరాన్ని రాచకొండ సీపీ మహేష్ భగవత్ ప్రారంభించారు. సీఐఏ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో సిపితో పాటు మల్కాజ్ గిరి డీసీపి ఉమామహేశ్వర శర్మ, కుషాయిగూడ ఏసీపి సయ్యద్ రఫీక్, లయన్స్ క్లబ్ సభ్యులు మరియు చర్లపల్లి పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
తమిళనాడు రాష్ట్రం లో ఇవాళ ఓ హృదయవిదారక, విషాద సంఘటన చోటుచేసుకుంది. అప్పుల బాధ తట్టుకోలేక ఓ వ్యక్తి తన చిన్నారి కొడుకులతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే ఓ వ్యక్తి తన కుటుంబ అవసరాల కోసం ఓ వడ్డీ వ్యాపారి దగ్గర లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడు. వడ్డీతో కలిపి 8 నెలలకు ఆ అప్పు 2 లక్షలకు చేరుకుంది. దీంతో అప్పిచ్చిన వడ్డీ వ్యాపారి ఆ వ్యక్తిని అప్పు కట్టమని వేధించసాగాడు. అతడు డబ్బు తేదని, తర్వాత కడతానని చెప్పినా వినిపించుకోకుండా ఒత్తిడి తేసాగాడు. దీంతో బాధితుడు పోలీసులకు పిర్యాదు చేశాడు. అయినా ఫలితం లేకపోవడంతో ఇవాళ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడానికి కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లాడు. అయితే అక్కడ ఏమైందో ఏమో గాని తనతో పాటు తన ఇద్దరు పిల్లల( ఒకరు 2 సంవత్సరాల వయసు, మరొకరు 5 సంవత్సరాలు) ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
అయితే బాధితులు మంటల్లో కాలిపోతుండగా అక్కడున్న వారు మానవత్వాన్ని మరిచి అలా చూస్తూ ఉండిపోయారు. కాపాడటానికి ఎవరూ ముందుకు రాలేదు. మరి కొందరయితే ఫోటోలు, వీడియోలు తీసుకున్నారే తప్ప కాపాడే ప్రయత్నం చేయలేదు. చివరకు దైర్యం చేసి ఒకరిద్దరు వారిని కాపాటానికి ముందుకు వచ్చారు. మంటల ఆర్పి వారిని ఆస్పత్రికి తరలించారు.
మేడ్చల్ జిల్లా పరిధిలోని జవహర్ నగర్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఉద్రిక్తతకు సంభందించిన సమాచారం ఈ విధంగా ఉంది. గత సంవత్సరం ఆంద్ర,ఒరిస్సా బార్డర్ ఓ పోలీసుల ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్ట్ ప్రభాకర్ జ్ఞాపకార్థం అతడి అభిమానులు యాప్రాల్ లో ఓ స్థూపాన్ని నిర్మించడానికి ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసుల అక్కడికి చేరుకుని నిర్మాణాన్ని అడ్డుకున్నారు. అంతే కాకుండా అనుమతి లేకుండా ఈ నిర్మాణాన్ని చేపడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అరెస్టైన వారు పోలీస్ స్టేషన్ లోనే ఆందోళనకి దిగారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సిద్దిపేట జిల్లా రాఘవాపూర్ లో దారుణం జరిగింది. ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించిన విషాద సంఘటన ఇక్కడ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే రాఘవాపూర్ కు చెందిన మౌనిక అనే యువతికి కరీంనగర్ జిల్లా మెట్పల్లికి చెందిన సాయికృష్ట తో గత నెల 6 నే అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. అప్పటినుంచి అత్తవారింట్లోనే ఉంటున్న మౌనిక, నాలుగు రోజుల క్రితం తన పుట్టినిల్లైన రాఘవ పూర్ కు వచ్చింది. అయితే ఇవాళ ఉదయం 7 గంటల సమయంలో బాత్రూం లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా : శంషాబాద్ మండలం తొండుపల్లి లో ఓ దొంగ హల్ చల్ చేశాడు. జాతీయ రహదారిపై ఆటోలో వెళుతున్న భార్యాభర్తల వద్ద నుండి డబ్బలతో కూడిన బ్యాగును బైకుపై వచ్చిన గుర్తుతెలియని దుండగుడు ఎత్తుకెళ్లాడు. ఈ బ్యాగులో రెండు లక్షల నగదు, నాలుగు తులాల బంగారు నగలు ఉన్నట్లు భాదితులు అబ్దుల్ జలీల్, పర్వానా లు శంషాబాద్ పోలీసులకు తెలిపారు. వీరి నుంచి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
డ్రగ్స్ మాఫియా మరోసారి హైదరాబాద్ నగరంలో కలకలం సృష్టించింది. కూకట్‌పల్లిలో నివాసముంటున్న నేరెళ్ళ చంద్రశేఖర్ కు డ్రగ్స్ మాఫియాతో విబేధాలు రావటంతో మాఫియా సభ్యులు అతడ్ని హత్య చేశారు. వివరాల్లోకి వెళితే కొన్ని నెలల క్రితం మద్యప్రదేశ్ కు చెందిన ఓ డ్రగ్ మాఫియాకు సరకు సరఫరా చేసి అక్కడి పోలీసులకు చంద్రశేఖర్ పట్టుబడ్డాడు. పోలీసులు విచారణలో డ్రగ్స్ మాఫియా కేంద్రాల వివరాలు పోలీసులకు తెలుపగా, వారు సుమారు 2 కోట్ల రూపాయలు విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో అతడిపై కక్ష పెంచుకున్న మాఫియా సభ్యులు మత్సగిరి, భూషణ్ పాండే, సంతోష్ సింగ్ లు హైదరాబాద్ కు వచ్చి చంద్రశేఖర్ ను తమకు రెండు కోట్ల రూపాయల నష్టం తాలూకు డబ్బులు ఇవ్వాలని చితకబాదారు. దాంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితులు మృత దేహాన్ని ఘట్కేసర్ కొర్రేముల ఓఆర్ఆర్. కల్వర్ట్ ప్రక్కన పూడ్చి పెట్టారు.